Home Entertainment #RRR 6 రోజుల కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

#RRR 6 రోజుల కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
890

తెలుగు సినిమా ఖ్యాతిని దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచం నలుమూలల బాహుబలి సినిమాతో ఎలా మారుమోగిపోయ్యేలా చేసాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఈ సినిమా తర్వాత ఆయన తెరకెక్కించే ఏ సినిమాకి అయినా అంచనాలు కనివిని ఎరుగని రేంజ్ లో ఉంటాయి అనే సంగతి మనం ఊహించవచ్చు,ఆ అంచనాలను మ్యాచ్ చెయ్యడం అంటే మాములు విషయం కాదు అనే చెప్పాలి, కానీ అందరిలాంటి దర్శకుడు అయితే కాదు కదా రాజమౌళి , మన అంచనాలకు ఆయన ఎప్పుడు అందడు, బాహుబలి సినిమా తర్వాత ఆయన ఏకంగా ఈ జనరేషన్ మాస్ హీరోలు అయినా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తో కలిసి మల్టీస్టార్ర్ర్ చేస్తున్నాను అని పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చారు,ఈ కాంబినేషన్ కి పర్కాటించిన రోజు నుండే అంచనాలు ఎవ్వరు ఊహించని స్థాయికి వెళ్లాయి , ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా కనివిని ఎరుగని రేంజ్ బిజినెస్ తో ఇటీవలే విడుదల అయ్యి సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే, రోజుకి 100 కోట్ల రూపాయల చొప్పున గ్రాస్ ని వసూలు చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర పెను విస్ఫోటనం ని సృష్టించింది ఈ సినిమా, విడుదల అయ్యి దాదాపుగా వారం కావొస్తుఇండడం తో ఈ సినిమా ఇప్పటి వరుకు ఎంత వసూలు చేసిందో చూద్దాము.

మొదటి రోజు దాదాపుగా 234 కోట్ల రూపాయిలు వసూలు చేసి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు ని సృష్టించిన ఈ సినిమా అదే ఊపుతో ఇప్పటికి బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సషనల్ రన్ ని సొంతం చేసుకుంటూ రోజుకో రికార్డుని సృష్టిస్తూ అటు మెగా అభిమానులకు ఇటు నందమూరి అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తోంది ఈ సినిమా,ఇప్పటి వరుకు ఈ సినిమా 5 రోజులకు గాను దాదాపుగా 610 కోట్ల రుపాయిల గ్రాస్ ని వసూలు చేసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో సరికొత్త రికార్డుని నెలకొల్పింది,ఇక షేర్ ప్రకారం చూస్తే ఈ సినిమా ఇప్పటి వరుకు అన్ని భాషలకు కలిపి 352 కోట్ల రూపాయిలు వసూలు చేసింది, ఈ సినిమాని కొన్న బయ్యర్లందరూ దాదాపుగా 90 శాతం కి పైగా సేఫ్ అయిపోయారు, ఈ వారం తో అన్ని ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ మార్కుని సాధించి లాభాల వర్షాలు కురిపించేలా చేస్తుంది అని ట్రేడ్ వర్గాల అంచనా, ఒక్కసారి ఈ సినిమా ప్రాంతాల వారీగా 5 రోజులకు గాను ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

నైజం ప్రాంతం లో ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతుంది అనే చెప్పాలి, ఇప్పటి వరుకు ఈ సినిమా దాదాపుగా 68 కోట్ల రూపాయిల షేర్ ని సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డుని సృష్టించింది, బాహుబలి ఫుల్ రన్ షేర్ ని ఈ సినిమా కేవలం వారం లోపే దాటి వెయ్యడం విశేషం, ఫుల్ రన్ లో ఇక్కడ 100 కోట్ల రూపాయిలు వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది, ఇక వైజాగ్ ప్రాంతం లో ఈ సినిమా 19 కోట్ల రూపాయిల షేర్ , అలాగే ఈస్ట్ గోదావరి లో 10 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ ని సాధించి సెన్సేషన్ సృష్టించింది, వెస్ట్ గోదావరి లో 9 కోట్ల 20 లక్షల రూపాయిలు, కృష్ణ జిల్లాలో 9 కోట్ల 80 లక్షల రూపాయిలు , గుంటూరు జిల్లాలో 13 కోట్ల రూపాయిలు , ఇక హీరోలిద్దరికి కంచు కోటలా ఉన్న సీడెడ్ ప్రాంతం లో 33 కోట్ల 50 లక్షల రూపాయిలు షేర్ ని వసూలు చేసింది, ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం 5 రోజులకు గాను 353 కోట్ల రూపాయిల షేర్ ని సాధించి సెన్సేషన్ సృష్టించింది, ఫుల్ రన్ లో ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మరియు 500 కోట్ల రూపాయిల షేర్ ని సాధించే అవకాశాలు ఉన్నాయి అని ట్రేడ్ వగల అంచనా.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…