
తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొత్తం నిన్న మొన్నటి వరుకు గర్వంగా ఫీల్ అయ్యి ఇది మా తెలుగు సినిమా అని చెప్పుకునే విధంగా చేసిన సినిమా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం,ఇది నిన్న మొన్నటి చరిత్ర, ఇక నేటి నుండి ప్రతి తెలుగు వాడు మరోసారి గర్వంగా ఇది మా తెలుగు సినిమా అని చెప్పుకునేలా చేసిన సినిమా రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టార్ర్ర్ ఆర్ ఆర్ ఆర్, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ తమ అద్భుతమైన నటనలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నారు అనే చెప్పాలి, ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ, ఈ సినిమా టికెట్స్ దొరికిన వాడికి అదృష్టం అనే చెప్పాలి,ఆ స్థాయిలో ఈ సినిమా డిమాండ్ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నది, మొదటి మూడు రోజుల్లో బాషా తో సంబంధం లేకుండా ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డుల సునామి గురించే ఈరోజు మనం ఈ ఆర్టికల్ లో మాట్లాడుకోబోతున్నాము.
మొదటి రోజు ఈ సినిమా ఏకంగా 234 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి ప్రభంజనం సృష్టించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపొయ్యేలా చేసింది, ఇక రెండవ రోజు కూడా అదే స్థాయి వసూళ్లను రాబట్టి కేవలం రెండు రోజుల్లోనే దాదాపుగా 350 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసేలా చేసింది, ఈ స్థాయి వసూళ్లు బాహుబలి సినిమాకి కూడా రాలేదు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కి ఈ సినిమా ద్వారా ఇతర రాష్ట్రాల్లో కూడా కానివి ఎరుగని రేంజ్ రీచ్ వచ్చింది , ముఖ్యంగా వీళ్లిద్దరు చూపించిన నటన కి ముగ్దులు అవ్వని ప్రేక్షకుడు అంటూ ఎవ్వడు మిగిలి లేదు అని అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు, తోలి రెండు రోజుల్లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా మూడవ రోజు అయితే బాక్స్ ఆఫీస్ వద్ద పెను విస్ఫోటనం సృష్టించింది అనే చెప్పాలి, ముఖ్యంగా హిందీ లో అయితే ఈరోజు వచ్చిన వసూళ్లు మొదటి రోజు కంటే ఎక్కువ అని చెప్పొచ్చు.
ఒక్క తెలుగు మరియు హిందీ బాషలలో మాత్రమే కాదు, తమిళం మరియు మలయాళం బాషలలో కూడా ఈ సినిమా మూడవ రోజు ప్రభంజనం సృష్టించింది, తోలి మూడు రోజలు గాను ఈ సినిమా అన్ని భాషలకు కలిపి 500 కోట్ల రూపాయిల గ్రాస్ ని అలాగే 260 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది , ఈ స్థాయి వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం నాల్గవ రోజు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద స్థిరం గా నిలబడితే ఫుల్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల అంచనా, ఇదే కనుక జరిగితె ఈ సినిమా రికార్డ్స్ ని భవిష్యత్తు లో రాబొయ్యే పాన్ ఇండియా సినిమాలు కొట్టడం చాలా కష్టం అనే చెప్పాలి, మరి ఈ సినిమా రేంజ్ ఎక్కడి వరుకు వెళ్లి ఆగుతుందో చూడాలి.