
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ బాషలలో విడుదల అయినా ఈ సినిమా ప్రతి భాషలోనూ కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది, ఇటీవలే ఈ చిత్రం రెండు వారాలు దిగ్విజయం గా పూర్తి చేసుకొని మూడవ వారం లోకి అడుగుపెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే, మూడవ వారం లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అదరగొడుతూ ట్రేడ్ పండితులకు సైతం మతిపొయ్యేలా చేస్తుంది ఈ చిత్రం, ఇప్పటి వరుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి,మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో భారీ బడ్జెట్ సినిమాలు చాలానే వచ్చాయి, కానీ ఒక్క బాహుబలి పార్ట్ 2 మరియు దంగల్ సినిమాలు మినహా ఒక్క సినిమా కూడా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోలేదు, కానీ RRR చిత్రం కేవలం 16 రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది, ఒక్కసారి ప్రాంతాల వారీగా ఈ సినిమా ఎంత వసూలు చేసింది, బయ్యర్లకు వచ్చిన లాభాలు ఎంత, నష్టపోయిన సెంటర్లు ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
ముందుగా ఈ సినిమా బాలీవుడ్ కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటి రోజు ఈ సినిమా అక్కడ దాదాపుగా 19 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసి మంచి ఓపెనింగ్ ని దక్కించుకుంది, 19 కోట్ల రూపాయిల నెట్ తో ప్రారంభం అయినా ఈ సినిమా జైత్ర యాత్ర 250 కోట్ల రూపాయిల నెట్ ని వరుకు కొనసాగి ఇప్పటికి దిగ్విజయంగా థియేటర్స్ లో ఆడుతూ ముందుకు దూసుకుపోతుంది, ఫుల్ రన్ లో ఈ సినిమా ఇక్కడ 270 కోట్ల రూపాయిల నెట్ వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది, బాహుబలి సినిమా తర్వాత ఒక్క తెలుగు దబ్ సినిమా ఈ స్థాయి వసూలు రావడం కేవలం RRR కి మాత్రమే జరిగింది, ఈ సినిమాని బాలీవుడ్ లో డిస్ట్రిబ్యూట్ చేసిన పెన్ మూవీస్ సంస్థకి దాదాపుగా 40 కోట్ల రూపాయలకు పైగానే లాభాలు వాచినట్టు సమాచారం, ఇక తెలుగు లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమా దాదాపుగా 260 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది, ఇందులో కేవలం నైజం ఏరియా నుండే దాదాపుగా 110 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసినట్టు సమాచారం, రాయలసీమ ప్రాంతం లో కూడా ఈ సినిమా దాదాపుగా 50 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి సరికొత్త ప్రభంజనం సృష్టించింది.
ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, కొన్ని ప్రాంతాలలో స్వల్ప నష్టాలు వచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగ వినిపిస్తున్న వార్త, కేరళ మరియు కర్ణాటక ప్రాంతాలలో ఈ సినిమా ఫుల్ రన్ లో స్వల్ప నష్టాలు వచ్చే అవకాశం ఉంది అని ట్రేడ్ పండితుల అభిప్రాయం, అంతే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సినిమా ని కొన్ని సి మరియు డీ సెంటర్స్ లో భారీ మొత్తం లో కొనుగోలు చేసారు అని, ఆ ప్రాంతాలలో 10 శాతం నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త,మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అన్ని భాషలకు కలిపి 570 కోట్ల రూపాయిలు వసూలు చేసింది అని, ఫుల్ రన్ లో 600 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది, రాజమౌళి గత చిత్రం బాహుబలి పార్ట్ 2 దాదాపుగా అన్ని భాషలకు కలిపి 1800 కోట్ల రూపాయిలు గ్రాస్ ని వసూలు చేసింది, కానీ RRR చిత్రం ఫుల్ రన్ లో 1200 కోట్ల రూపాయిల గ్రాస్ ని మాత్రమే వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.