Home Entertainment #RRR 2 వ రోజు కలెక్షన్లు..నిర్మాతలకు ఇది ఊహించని షాక్

#RRR 2 వ రోజు కలెక్షన్లు..నిర్మాతలకు ఇది ఊహించని షాక్

0 second read
0
1
498

యావత్తు భారతదేశ సినీ ప్రియులు మొత్తం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీస్టార్ర్ర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ ఇటీవలే విడుదల అయ్యి సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే,ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి మాస్ హీరోలు కలిసి చేస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా పై అంచనాలు మొదటి నుండి భారీ స్థాయిలోనే ఉండేవి, ఆ అంచనాలను మించి ఈ సినిమా టాక్ ని కైవసం చేసుకోవడమే కాకుండా , ఇప్పట్లో సాధ్యపడదు అని అందరూ అనుకుంటున్న బాహుబలి పార్ట్ 2 మొదటి రోజు వసూళ్లను అధిగమించి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసింది ఈ చిత్రం, మొదటి రోజు దాదాపుగా ఈ సినిమా 234 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది, ఇది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే సరికొత్త చరిత్ర, ఒక్క టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్, కోలీవుడ్ మరియు మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలలో ఈ సినిమా కనివిని ఎరుగని ఓపెనింగ్స్ ని సాధించి తెలుగోడి సత్తా అందరికి అర్థం చేసింది.

మొదటి రోజు ఈ స్థాయి ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా రెండవ రోజు కూడా అదే స్థాయి వసూళ్లను రాబట్టి అందరిని ఆశ్చర్యపొయ్యేలా చేసింది, తెలుగు, హిందీ , కన్నడ , మళయాలం మరియు తమిళం ఇలా విడుదల అయినా ప్రతి భాషలో స్థిరమైన వసూళ్లను చూపెడుతూ రెండవ రోజు కూడా సెన్సషనల్ రికార్డ్స్ ని నెలకొల్పింది,ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండవ రోజు అక్షరాలా 150 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డును నెలకొల్పింది,హిందీ లో ఐతే మొదటి రోజు వసూళ్లకంటే రెండవ రోజు వసూళ్లు ఎక్కువ రావడం విశేషం అనే చెప్పాలి, ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం లో ఈ సినిమా ఒక్క బాక్స్ ఆఫీస్ సునామి ని సృష్టించింది అనే చెప్పాలి, రెండవ రోజు 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని సాధించిన ఈ సినిమా తోలి రెండు రోజులకు కలిపి అక్షరాలా 40 కోట్ల రూపాయిల షేర్ ని సాధించి సెన్సేషన్ సృష్టించింది, మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా రెండవ రోజు దాదాపుగా 30 కోట్ల రూపాయలకు పైగానే షేర్ ని సాధించి ఇతర హీరోలకు అనితర సాయంగా రికార్డుని ఇచ్చింది.

ఇక అమెరికా లో అయితే ఈ సినిమా ప్రభంజనం ముందు హాలీవుడ్ మూవీస్ కూడా పనికి రాలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు, రెండవ రోజు ఈ సినిమా దాదాపుగా 20 లక్షల డాలర్లు వసూలు చేసి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు ని నెలకొల్పింది,అమెరికా లో ఈ సినిమా హక్కులను 12 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయగా కేవలం రెండు రోజుల్లోనే 8 మిలియన్ డాలర్స్ కి పైగా వసూలు చేసి మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే దిశగా దూసుకుపోతుంది,ఫుల్ రన్ లో ఈ సినిమా కేవలం అమెరికా నుండే 20 మిలియన్ డాలర్స్ వసూలు చేసే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం,నార్గ్వా రోజు కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్థిరంగా నిలబడితే ఫుల్ రన్ లో కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాల అంచనా, మరి ఈ టార్గెట్ ని ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…