Home Entertainment KGF చాప్టర్ 2 10 రోజుల వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

KGF చాప్టర్ 2 10 రోజుల వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

4 second read
0
0
304

ఇండియన్ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర KGF చాప్టర్ 2 సృష్టించిన ఓపెనింగ్స్ ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కన్నడ చలన చిత్ర పరిశ్రమ మొత్తం గర్వం తో తలెత్తుకునేలా చేసింది ఈ సినిమా..ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఈ మూవీ వసూళ్ల ప్రభంజనం ఇంకా ఆగలేదు…వీక్ డేస్ లో కూడా డబల్ డిజిట్ నంబర్స్ వసూలు చేస్తూ బాలీవుడ్ లో కొత్త బెంచ్ మార్క్స్ ని సృష్టిస్తుంది ఈ చిత్రం..ఫుల్ రన్ లో కేవలం బాలీవుడ్ నుండే 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనా..వందేళ్ల బాలీవుడ్ సినీ పరిశ్రమ హిస్టరీ లో హిందీ లో దబ్ అయినా తెలుగు సినిమాలు ప్రభంజనం సృష్టించడం చూసాం..తమిళ్ సినిమాలు ప్రభంజనం సృష్టించడం చూసాం..కానీ ఒక్క కన్నడ సినిమా బాలీవుడ్ సినిమాని శాసించే స్థాయి లో రికార్డ్స్ ని నెలకొల్పడం ఇదే తొలిసారి చూస్తున్నాం..విడుదల అయ్యి పది రోజులు గడుస్తున్నా ఈ సినిమా ఇప్పటి వరుకు అన్నీ భాషలకు కలిపి ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదల అయినా రాజమౌళి మల్టీస్టార్ర్ర్ #RRR చిత్రం మొదటి రోజు దాదాపుగా 232 కోట్ల రూపాయల గ్రాస్ ని వసూలు చేసింది..ఇప్పట్లో ఈ సినిమా మొదటి రోజు వసూళ్లు ఎవ్వరు ముట్టుకోలేరు అని అందరూ అనుకుంటున్న సమయం లో KGF చాప్టర్ 2 వచ్చింది..అందరి అంచనాలను మించి ఈ సినిమా మొదటి రోజే దాదాపుగా 220 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి #RRR కి పోటీ ని ఇచ్చింది..బాలీవుడ్ లో అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ప్రకంపనలు గురించి కనీసం పదేళ్లు అయినా మాట్లాడుకోవచ్చు..ఎందుకంటే మొదటి రోజే అక్కడ 54 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం వారం లోపే #RRR మూవీ హిందీ లైఫ్ టైం వసూళ్లను అధిగమించి సంచలనం సృష్టించింది..పది రోజులకు గాను ఇక్కడ ఈ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా హిందీ వెర్షన్ లో నెట్ వసూళ్లు సాధించింది అని ట్రేడ్ వర్గాల అంచనా..ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 74 కోట్ల రూపాయిల షేర్ ని పది రోజులకు గాను వసూలు చేసిన ఈ సినిమా తమిళం లో 40 కోట్ల రూపాయిల షేర్ మరియు కన్నడ లో దాదాపుగా 80 కోట్ల రూపాయిలకు పైగా షేర్ ని వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.

మొత్తం మీద అన్నీ భాషలకు కలిపి 10 రోజులకు గాను 820 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ 450 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాల అంచనా..అన్నీ బాషలలో ఇప్పటికి డీసెంట్ వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రం ..మన తెలుగు లో మాత్రం బాగా డౌన్ అయ్యింది అనే చెప్పాలి..వీకెండ్ లో వచ్చిన ఓపెనింగ్స్ ఊపు ని వీక్ డేస్ లో మాత్రం ఈ సినిమా కొనసాగించలేకపోయింది అనే చెప్పాలి..దానికి కారణం ఇలాంటి మాస్ యాక్షన్ మూవీ ని యూత్ మరియు మాస్ ఆడియన్స్ ఎగబడి చూస్తారు కానీ..ఫామిలీ ఆడియన్స్ ఆదరణ మాత్రం ఎప్పుడు తక్కువగానే ఉంటుంది..అందుకే ఒక్క సినిమా లాంగ్ రన్ కి కచ్చితంగా ఫామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉండాలి అని అందరూ అంటూ ఉంటారు..ఈ సినిమాకి ఫామిలీ ఆడియన్స్ లేని లోటు ఫుల్ రన్ కలెక్షన్స్ లో స్పష్టంగా తెలుస్తుంది..ఫుల్ రన్ లో ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని కచ్చితంగా అందుకుంటుంది అని అయితే చెప్పొచ్చు..కానీ #RRR (1100 కోట్లు ) రికార్డ్స్ ని అందుకుంటుందో లేదో అనేది బాలీవుడ్ ఆడియన్స్ చేతిలో ఉన్నది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…