
భారతదేశ సినీ ప్రియులు మొత్తం ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మూవీ మేనియా లో ఎలా మునిగి తేలుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మార్చ్ 25 వ తారీఖున దేశ వ్యాప్తంగా ప్రారంభం అయినా ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రభంజనం నేటికీ ఏ మాత్రం ఊపు తగ్గకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రోజుకో ప్రభంజనం సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతుంది,బాహుబలి సినిమా తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగరాసిన రాజమౌళి ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మూవీ తో దానికి మించిన ప్రభంజనం సృష్టించాడు అనే చెప్పాలి,మొదటి రోజు 234 కోట్ల రూపాయిల గ్రాస్ తో ప్రారంభం అయినా ఈ చిత్రం అతి త్వరలోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోబోతుంది, ఇప్పటి వరుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన సినిమాలు కేవలం రెండు మాత్రమే, ఒక్కటి బాహుబలి పార్ట్ 2 కాగా మరొక్కటి అమిర్ ఖాన్ నటించిన దంగల్, ఈ రెండు సినిమాల తర్వాత అతి త్వరలోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరబోతోంది రాజమౌళి ఆర్ ఆర్ ఆర్, ఇప్పటి వరుకు పది రోజులకు గాను ఈ సినిమా ఎంత వసూలు చేసింది అనే దాని పై ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
ముఖ్యంగా ఈ సినిమా నైజాం ఏరియా లో ఒక్క ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది అనే చెప్పాలి, తోలి వారం లో ఈ సినిమా ఈ ప్రాంతం లో ఇక్కడ ఏకంగా 77 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది, ఈ సినిమా నైజం ఏరియా హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దాదాపుగా 70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు, ఆయన పెట్టిన డబ్బులు వారం లోనే తిరిగి రాగ దానికి అదనంగా 7 కోట్ల రుపాయిల లాభాలు మొదటి వారం లోనే వచ్చాయి, ఇక శనివారం ఉగాది అవ్వడం తో ఈ సినిమా ఈ ఒక్క రోజే ఇక్కడే దాదాపుగా 8 కోట్ల రూపాయిల షేర్ ని సాధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది,మొత్తం మీద పది రోజులకు గాను ఈ సినిమా ఇక్కడ 90 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది, ఇక రాయలసీమ ప్రాంతం లో ఈ సినిమా తోలి వారం లో 36 కోట్ల రూపాయిలు వసూలు చెయ్యగా పది రోజులకు గాను 45 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల అంచనా.
ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఈ సినిమా మొదటి వారం దాదాపుగా 21 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది,పది రోజులకు గాను ఈ ప్రాంతం లో ఈ సినిమా 25 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల అంచనా, ఇక తూర్పు గోదావరి జిల్లాలో 14 కోట్లు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 12 కోట్ల రూపాయిల షేర్ ని పది రోజులకు గాను వసూలు చేసే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి, నెల్లూరు జిల్లా నుండి పది రోజులకు గాను 8 కోట్ల రూపాయిల షేర్ , గుంటూరు జిల్లా నుండి 16 కోట్ల రూపాయిల షేర్ అలాగే కృష్ణ జిల్లా నుండి 12 కోట్ల రూపాయిల షేర్ ని ఈ సినిమా వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది, ఇక హిందీ లో ఈ సినిమా మొదటి రోజు నుండే వండర్స్ సృష్టిస్తుంది అనే సంగతి మన అందరికి తెలిసిందే, కేవలం మొదటి వారం లోనే ఇక్కడ ఆ సినిమా దాదాపుగా 65 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి, పది రోజులకు గాను ఈ సినిమా హిందీ బాషా లో కూడా వంద కోట్ల రూపాయిల షేర్ ని అందుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది, మొత్తం మీద ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పది రోజులకు గాను అన్ని భాషలకు కలిపి 450 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.