Home Entertainment #RRR సినిమా పై ప్రశంసల వర్షం కురిపించిన నందమూరి బాలకృష్ణ

#RRR సినిమా పై ప్రశంసల వర్షం కురిపించిన నందమూరి బాలకృష్ణ

0 second read
0
1
5,548

గత మూడు రోజుల నుండి దేశం మొత్తం వినిపిస్తే ఒక్కే ఒక్క మాట ఆర్ ఆర్ ఆర్, భారీ అంచనాల నడుమ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని కైవసం చేసుకొని రికార్డుల వర్షం కురిపిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఒక్క తెలుగు లోనే కాదు హిందీ మరియు తమిళం లో కూడా ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం మామూలుది కాదు అనే చెప్పాలి, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తమ అద్భుతమైన నటనలతో వెండితెర మీద విస్ఫోటనం సృష్టించాడు అనే చెప్పాలి, బాషా బేధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ ఇద్దరి హీరోల నటనకి సెల్యూట్ చేస్తున్నారు,బాహుబలి తర్వాత తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచ నలుమూలల వ్యాపించేలా చేసాడు, ఈ సినిమా సృష్టిస్తున్న బాక్స్ ఆఫీస్ విస్ఫోటనం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు,ఎందుకంటే రోజు అది మనం చూస్తున్నదే,కానీ ఈ సినిమాని చూసి పొగడ్తలతో ముంచి ఎత్తిన కొంతమంది సెలెబ్రిటీల గురించి మాత్రం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

ముందుగా ఏ సినిమా హిట్ అయినా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేసే సూపర్ స్టార్ మహేష్ బాబు , ఈ సినిమాకి కూడా మొట్టమొదటిసారి ఆయనే హీరోలను మరియు డైరెక్టర్ రాజమౌళి ని మెచ్చుకుంటూ ఒక్క ట్వీట్ వేసాడు , ఆయన మాత్రమే కాదు, సినిమా రివ్యూ లు ఇవ్వడానికి ఎప్పుడు దూరంగా ఉండే నందమూరి బాలకృష్ణ కూడా ఈసారి ఆర్ ఆర్ ఆర్ మూవీ గురించి ప్రత్యేకమైన వీడియో ఒక్కటి విడుదల చేసాడు, ఆయన మాట్లాడుతూ ‘నేటి తరం హీరోలు అయినా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఎలాంటి భేదభావాలు లేకుండా కలిసి డైరెక్టర్ రాజమౌళి గారి ఆర్ ఆర్ ఆర్ లో నటించడం నిజంగా చాలా ఆనందం వేసింది,ఇద్దరు ఎంతో అడుతంగా నటించారు , వీళ్ళ నటనకి నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి , ముఖ్యంగా మా బిడ్డ ఎన్టీఆర్ కొమరం భీముడొ సాంగ్ లో కనబర్చిన అభినయం ఇప్పటికి నన్ను వెంటాడుతూనే ఉంది,మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలల విస్తరింప చేసిన రాజమౌళి కి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ‘ అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది.

ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పటి వరుకు కనివిని ఎరుగని రేంజ్ లో కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్ల రుపాయిల గ్రాస్ ని వసూలు చేసి చరిత్ర సృష్టించింది, ఒక్క ఇండియాలోనే కాదు, ఇతర దేశాలలో కూడా ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తుంది, అమెరికా లో అయితే ఈ సినిమా ప్రభంజనం ముందు హాలీవుడ్ మూవీస్ కూడా పనికి రాలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు, రెండవ రోజు ఈ సినిమా దాదాపుగా 20 లక్షల డాలర్లు వసూలు చేసి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు ని నెలకొల్పింది,అమెరికా లో ఈ సినిమా హక్కులను 12 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయగా కేవలం రెండు రోజుల్లోనే 8 మిలియన్ డాలర్స్ కి పైగా వసూలు చేసి మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే దిశగా దూసుకుపోతుంది,ఫుల్ రన్ లో ఈ సినిమా కేవలం అమెరికా నుండే 20 మిలియన్ డాలర్స్ వసూలు చేసే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం,నార్గ్వా రోజు కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్థిరంగా నిలబడితే ఫుల్ రన్ లో కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాల అంచనా, మరి ఈ టార్గెట్ ని ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…