
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి రికార్డ్స్ ని దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం నేడు ఎలా బద్దలు కొట్టిందో మన అందరికి తెలిసిందే, దాదాపుగా నాలుగేళ్ల పాటు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తెరకెక్కించిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 వ తారీఖున విడుదల అయ్యి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి సరికొత్త ప్రభంజనం సృష్టించింది,ఈ సినిమా కి సంబంధించిన సక్సెస్ పార్టీ ఇటీవల ముంబై లో ఘనంగా జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సక్సెస్ పార్టీ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ టీం తో పాటుగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ కూడా ముఖ్య అతిధిగా హాజరు అయినా సంగతి మన అందరికి తెలిసిందే, అమిర్ ఖాన్ తో పాటుగా బాలీవుడ్ కి చెందిన ప్రముఖులు కూడా ఈ సక్సెస్ పార్టీ లో హాజరు అయ్యారు, అయితే ఈ సక్సెస్ పార్టీ కి ముందు ఏర్పాటు చేసిన మీడియా సమేవేశం లో కొంత మంది మీడియా రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలు కాస్త ఇబ్బందికి గురి చేసాయి అనే చెప్పాలి, ఇప్పుడు సోషల్ మీడియా అంతటా ఆ వీడియో తెగ వైరల్ గా మారింది.
విలేకరి ఎన్టీఆర్ తో మాట్లాడుతూ ‘ మీకంటే రామ్ చరణ్ కి ఈ సినిమా ద్వారా ఎక్కువ క్రేజ్ వచ్చింది కదా, దీనికి మీరు ఏమి అంటారు’ అని ఎన్టీఆర్ ని అడగగా, ఎన్టీఆర్ ఒక్కసారిగా సంతోషంగా ఉన్న మూడు నుండి కాస్త ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాడు, అప్పుడు వెంటనే రామ్ చరణ్ మైక్ అందుకొని ‘నేను మీ మాటలకి ఏకీభవించడం లేదు, మేము ఇద్దరం ఈ సినిమాలో బాగా నటించాము, ఎన్టీఆర్ నటన గురించి మేము ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, నేడు భారతదేశం మొత్తం ఆయన నటనకి జేజేలు పలుకుతున్నారు, అతనితో ఈ నాలుగేళ్ల నా జర్నీ లైఫ్ లో ఎప్పటికి మర్చిపోలేనిది, ఈ అవకాశం నాకు కలిపించినందుకు రాజమౌళి గారికి కృతఙ్ఞతలు తెలియచేసుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్, రామ్ చరణ్ మాట్లాడిన ఈ మాటలకు సోషల్ మీడియా అంతటా సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది, రామ్ చరణ్ సంస్కారానికి ఇది ఒక్క నిదర్శనం అంటూ ఎన్టీఆర్ అభిమానులు సైతం ఆయనని పొగడడం ప్రారంభించారు.
ఇక ఈ సినిమాకి నైజం ఏరియా లో ఎలాంటి అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఇక్కడ ఈ సినిమా ఏకంగా 100 కోట్ల రూపాయిల షేర్ ని సాధించి సరికొత్త ప్రభంజనం సృష్టించింది, ఒక్క ప్రాంతం లో వంద కోట్ల రూపాయిల షేర్ అంటే మాములు విషయం కాదు, మన టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి వంద కోట్ల రూపాయిల షేర్ వస్తే ఒక్క అద్భుతమైన అఛీవ్మెంట్ లా ఫీల్ అవుతున్న ఈ రోజుల్లో, కేవలం నైజాం ప్రాంతం నుండి వంద కోట్ల రూపాయిలు వసూలు చెయ్యడం అంటే ఒక్క అద్భుతం అనే చెప్పాలి, ఈ సినిమా నైజం ఏరియా హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దాదాపుగా 75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు, కేవలం 12 రోజుల్లోనే పాతిక కోట్ల రూపాయిల లాభాలు రావడం తో ఈ దిల్ రాజు ఫుల్ జోష్ మీద ఉన్నాడు, దీనితో ఆయన ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం కి ఒక్క ప్రత్యేకమైన పార్టీ ని ఇచ్చాడు, ఈ పార్టీ కి ఆర్ ఆర్ ఆర్ మూవీ టీం తో పాటుగా, ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు అందరూ హాజరు అయ్యారు, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి రాజమౌళి వేసిన నాటు నాటు స్టెప్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.