Home Entertainment #RRR విషయం లో ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణ చెప్పిన రాజమౌళి

#RRR విషయం లో ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణ చెప్పిన రాజమౌళి

0 second read
0
1
3,911

తెలుగు చలన చిత్ర పర్సిరమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు మరోసారి తీసుకెళ్లిన సినిమా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టార్ర్ర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్, ఈ సినిమా కోసం అటు మెగా అభిమానులు ఇటు నందమూరి అభిమానులు ఎంతలా ఎదురు చూసారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, దాదాపుగా నాలుగేళ్ల పాటు వాళ్ళు చూసిన ఎదురు చూపులకు ఈ సినిమా మంచి తృప్తి ని ఇచ్చింది అనే చెప్పాలి, ముఖ్యంగా హీరోలిద్దరు చేసిన నటనకి యావత్తు భారత దేశం సినీ అభిమానులు జేజేలు పలికింది అనే చెప్పాలి, దాదాపుగా 500 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 12 రోజుల్లోనే 900 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది, బాహుబలి తర్వాత ఆ స్థాయి వసూళ్లు ఈ సినిమాకే రావడం విశేషం,ఒక్క తెలుగు లోనే కాదు హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో కూడా ఈ సినిమా ఒక్క ప్రభంజనం సృష్టించింది అనే చెప్పాలి, ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక్క ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా సక్సెస్ అయ్యింది అని మూవీ టీం తో పాటు అభిమానులందరూ ఎంతో ఆనందం గా ఉన్నారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం కాస్త నిరాశకి గురి అయ్యారు అనే చెప్పాలి, ఎందుకంటే రామ్ చరణ్ పాత్ర తో పోలిస్తే మా అభిమాన హీరో ఎన్టీఆర్ పాత్ర కాటా తగ్గింది అని, మా హీరో ఈ సినిమా కోసం నాలుగేళ్ల సమయం ని ఇచ్చి సమయం ని వృధా చేసాడు అని, సినిమా మొత్తం రామ్ చరణ్ డి మాత్రమే అని, ఎన్టీఆర్ కి సెకండ్ హాఫ్ లో ప్రాధన్యత మొత్తం తగ్గింది, ముఖ్యంగా క్లైమాక్స్ లో రామ్ చరణ్ కి ఎక్కువ ఎలేవేషన్స్ ఇచ్చారు అని, ఇలా సోషల్ మీడియా ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళి ని టాగ్ చేసి విడుదల రోజు నుండి తిడుతూనే ఉన్నారు, అయితే రాజమౌళి ఈ కామెంట్స్ పై మాట్లాడుతూ ‘ మల్టీస్టార్ర్ర్ సినిమా అన్నాక ఇలాంటి కామెంట్స్ వస్తాయి అని ఊహించే ఈ సినిమాని తీసాను, ఒక్క ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు , రామ్ చరణ్ అభిమానులు కూడా మా హీరో క్యారక్టర్ తగ్గింది అంటూ నన్ను టాగ్ చేసిన తిట్టినా సందర్భాలు ఉన్నాయి, కానీ అభిమానులు కాకుండా సగటు ప్రేక్షకుడికి ఇద్దరినీ సరిసమానంగా చూపించాము అన్న భావనే కలిగింది, దాని వల్లే సినిమా ఈరోజు ఇంత పెద్ద హిట్ అయ్యింది’ అంటూ సమాధానం ఇచ్చాడు రాజమౌళి.

ఇక ఈ సినిమాకి త్వరలో సీక్వెల్ కూడా రాబోతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుండో గట్టిగ వినిపిస్తున్న వార్త, సోషల్ ఇండియా లో ప్రచారం అవుతున్న ఈ వార్తని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా దీనికి సానుకూలంగానే స్పందించాడు, సీక్వెల్ కి లైన్ అయితే అనుకున్నాం,కానీ స్టోరీ డెవలప్ చెయ్యాలి , దేవుడి ఆశీసులు దొరికి అన్ని చక్కగా జరిగితే కచ్చితంగా సీక్వెల్ తెరకెక్కిస్తాము అంటూ చెప్పుకుకొచ్చాడు విజయేంద్ర ప్రసాద్, ఇక ఈ సినిమా అద్భుత విజయం సాధించడం తో ఈ చిత్రం నైజం ఏరియా హక్కులను కొనుగోలు చేసిన దిల్ రాజు చిత్ర యూనిట్ మొత్తానికి ఇటీవలే ఒక్క భారీ సక్సెస్ పార్టీ ని ఏపాటుకి చేసాడు, ఈ సక్సెస్ పార్టీ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ టీం తో పాటు ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు అందరూ హాజరు అయ్యారు, ఈ పార్టీ లో రాజమౌళి వేసిన నాటు నాటు సాంగ్ స్టెప్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

 

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…