
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో ఎన్నడూ చూడని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల గలగలా తో కళకళలాడిపోతుంది..ఇటీవల దర్శకుడు ధీరుడు రాజమౌళి తెరెక్కెక్కించిన #RRR మూవీ బాక్స్ ఆఫీస్ సునామి నడుస్తున్న సమయం లోనే KGF చాప్టర్ 2 ఆ బాక్స్ ఆఫీస్ హీట్ ని కొనసాగిస్తూ తార స్థాయికి తీసుకెళ్ళిపోయింది..ఇప్పుడు ఈ సినిమాకి వస్తున్నా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూస్తుంటే మరికొద్ది రోజుల్లో #RRR మూవీ కలెక్షన్స్ ని కూడా దాటేస్తుందా? అనే సందేహం కలుగుతుంది..తోలి వీకెండ్ కి ఈ సినిమా కి వచ్చిన వసూళ్లు చూస్తే ఎవరికైనా ఇలాంటి సందేహం రాక తప్పదు..బాలీవుడ్ #KGF చాప్టర్ 2 సినిమా వసూళ్లు అక్కడి ట్రేడ్ వారాగాలను మెంటలెక్కిపొయ్యేలా చేస్తుంది..ఒక్క కన్నడ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఈ స్థాయిలో శాసిస్తుంది అని బహుశా KGF మేకర్స్ కూడా ఊహించి ఉండరు..#RRR మరియు బాహుబలి 2 ఫుల్ రన్ కలెక్షన్స్ కి సవాలు విసురుతున్న KGF చాప్టర్ 2 , నాలుగు రోజులకు గాను ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
అన్నీ బాషల కంటే హిందీ భాషలో KGF చాప్టర్ 2 సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం అంత ఇంత కాదు..మొదటి రోజు ఈ సినిమా అక్కడ ఏకంగా 53 కోట్ల రూపాయిల వరుకు నెట్ ని వసూలు చేసి ఆల్ టైం డే 1 రికార్డు గా నిలబడగా..రెండవ రోజు 48 కోట్లు అలాగే మూడవ రోజు 46 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసి కేవలం మూడు రోజుల్లోనే దాదాపుగా 150 కోట్ల రూపాయిలు వసూలు చేసిన ఏకైక సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది..ఇక ఆదివారం రోజు అయితే ఈ సినిమాకి వచ్చిన వసూలు చూసి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కంగుతిన్నాయి..మొదటి రోజు కంటే ఎక్కువగా ఇక్కడ దాదాపుగా 55 కోట్ల రూపాయిల నెట్ వసూలు చేసింది అని అంచనా..అంటే నాలుగు రోజులకు కలిపి ఈ సినిమా ఈ ప్రాంతం లో 204 కోట్ల రూపాయిల వరుకు నెట్ ని వసూలు చేసింది..లేటెస్ట్ సెన్సేషన్ #RRR ఫుల్ రన్ లో ఇప్పటి వరుకు 250 కోట్ల రూపాయలు వసూలు చెయ్యగా, KGF కేవలం నాలుగు రోజుల్లోనే 200 కోట్ల రూపాయిల నెట్ ని రాబట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ లో పెద్ద సంచలనం గా మారింది.
తెలుగు లో కూడా ఈ సినిమా వసూళ్లు ఏ మాత్రం ఊపు తగ్గకుండా డబ్బింగ్ చిత్రాలలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మూడు రోజులకు గాను దాదాపుగా 42 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసి డబ్బింగ్ సినిమాలలో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది..నాలుగు రోజులకు కలిపి ఈ సినిమా ఇక్కడ దాదాపుగా 53 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త ..ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ అక్షరాలా 75 కోట్ల రూపాయలకు జరగగా బ్రేక్ ఈవెన్ మార్కుని అతి తేలికగా అందుకొని ఫుల్ రన్ లో 90 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ పండితుల అంచనా..మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి 490 కోట్ల రూపాయిలు గ్రాస్ ని కేవలం నాలుగు రోజుల్లో వసూలు చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో కచ్చితంగా #RRR మూవీ రికార్డ్స్ ని బద్దలు కొట్టే దిశగా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది..మరి ఫుల్ రన్ లో ఈ సినిమా బాహుబలి పార్ట్ 2 సాధించిన 1800 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుందా లేదా అనేది చూడాలి.