
ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర గత మూడు రోజుల క్రితం ఒక్క సునామి వచ్చింది, ఆ సునామి పేరే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్, ఈ సినిమా కోసం అటు రామ్ చరణ్ అభిమానులు ఇటు ఎన్టీఆర్ అభిమానులు దాదాపుగా నాలుగేళ్ల నుండి ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సంగతి మన అందరికి తెలిసిందే, సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తున్నారు అంటే అంచనాలు మాములు స్థాయి లో ఉండవు, ఆలా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి చేస్తున్న సినిమాకి రాజమౌళి దర్శకుడు అయితే ఇక ఎలాంటి అంచనాలు ఉంటాయో చెప్పడానికి ఉదాహరణే ఆర్ ఆర్ ఆర్, సాధారణంగా ఈ స్థాయి అంచనాలు అందుకోవడం అంటే కత్తి మీద సాము లాంటిది, మిగతా డైరెక్టర్లకు అయితే అది అసాధ్యం అనే చెప్పాలి, కానీ రాజమౌళి మాత్రం ఆ అసాధ్యం ని కూడా సుసాధ్యం చేసి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతుంది.
ఇక ఈ సినిమాలో హీరోలు గా నటించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి కూడా అటు అభిమానుల నుండి ఇటు ప్రేక్షకుల నుండి ఏ స్థాయిలో ప్రశంసలు లభిస్తుందో , టాలీవుడ్ సెలెబ్రిటీల నుండి కూడా అదే స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి, ఇక ఈ సినిమాలో అల్లూరి సీత రామరాజు గా నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, యావత్తు భారత దేశం రామ్ చరణ్ నటనకి సెల్యూట్ చేసింది, ఎంతో పవర్ ఫుల్ గా రాజమౌళి గారు ఆయన పాత్రని తీర్చి దిద్దారు, అల్లూరి సీత రామ రాజు అంటే మనకి మొదటి నుండి గుర్తు వచ్చే పేరు సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే, ఆ స్థాయిలో ఆయన తెలుగు ప్రేక్షుకుల మీద ముద్ర వేశారు, ఇప్పుడు అల్లూరి సీత రామ రాజు గారి గెటప్ లో రామ్ చరణ్ సూపర్ స్టార్ కృష్ణ ని దాటేశాడు అని సినీ విశ్లేషకులు కామెంట్ చెయ్యడం తో దానిపై కృష్ణ తనదైన శైలిలో స్పందించారు, ఒక్కరితో పోల్చుకోవడం నాకు ఎప్పుడు ఇష్టం నుండదు అని , ఎవరి స్టైల్ వారిదే అని , రామ్ చరణ్ అల్లూరి సీత రామ రాజు గా అద్భుతంగా నటించాడు అని కృష్ణ గారు ఈ సందర్భంగా మాట్లాడారు.
ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పటి వరుకు కనివిని ఎరుగని రేంజ్ లో కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్ల రుపాయిల గ్రాస్ ని వసూలు చేసి చరిత్ర సృష్టించింది, ఒక్క ఇండియాలోనే కాదు, ఇతర దేశాలలో కూడా ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తుంది, అమెరికా లో అయితే ఈ సినిమా ప్రభంజనం ముందు హాలీవుడ్ మూవీస్ కూడా పనికి రాలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు, రెండవ రోజు ఈ సినిమా దాదాపుగా 20 లక్షల డాలర్లు వసూలు చేసి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు ని నెలకొల్పింది,అమెరికా లో ఈ సినిమా హక్కులను 12 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయగా కేవలం రెండు రోజుల్లోనే 8 మిలియన్ డాలర్స్ కి పైగా వసూలు చేసి మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే దిశగా దూసుకుపోతుంది,ఫుల్ రన్ లో ఈ సినిమా కేవలం అమెరికా నుండే 20 మిలియన్ డాలర్స్ వసూలు చేసే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం,నార్గ్వా రోజు కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్థిరంగా నిలబడితే ఫుల్ రన్ లో కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాల అంచనా, మరి ఈ టార్గెట్ ని ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.