Home Entertainment #RRR లో ఎన్టీఆర్ పులి ఫైట్ మేకింగ్ వీడియో చూస్తే రాజమోళి కి చేతులెత్తి దండం పెడుతారు

#RRR లో ఎన్టీఆర్ పులి ఫైట్ మేకింగ్ వీడియో చూస్తే రాజమోళి కి చేతులెత్తి దండం పెడుతారు

3 second read
0
0
752

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి మన అందరికి తెలిసిందే..ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి ఈ సినిమా దాదాపుగా 1200 కోట్ల రూపాయిలు వసూలు చేసింది..థియేటర్స్ లో ఉన్నప్పుడు ఈ సినిమా ఎన్ని ప్రభంజనాలు సృష్టించిందో..OTT లో కూడా అదే స్థాయి ప్రభంజనం సృష్టించింది..ముఖ్యంగా ఈ సినిమాకి పశ్చిమ దేశానికీ చెందిన మూవీ లవర్స్ మెంటలెక్కిపోతున్నారు..దర్శక ధీరుడు రాజమౌళి విజన్ కి జేజేలు పలుకుతున్నారు..హాలీవుడ్ దర్శకులకు కూడా ఈ స్థాయి విజన్ ఉండదని..రాజమౌళి కి సెల్యూట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..ముఖ్యం రామ్ చరణ్ ఇంట్రడక్షన్ ఫైట్, ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్..వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు..మరియు ఇంటర్వెల్ లో ఈ ఇద్దరి మధ్య వచ్చే భారీ ఫైట్..ముఖ్యంగా ఈ సన్నివేశాల గురించి రాజమౌళి పనితనం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఫైట్ కానీ..రామ్ చరణ్ ఇంట్రడక్షన్ ఫైట్ కానీ..వీటికి సంబందించి మేకింగ్ వీడియోస్ చూస్తే రాజమౌళి తెలివి కి దండం పెట్టక తప్పదు..ముఖ్యంగా ఎన్టీఆర్ పులి తో పోరాటం చేసే సన్నివేశం..నిజంగా అతను పులి తో తలపడ్డాడా అనే విధంగా చిత్రీకరించాడు..అయితే దీనికి సంబందించి మేకింగ్ వీడియో ఇటీవల విడుదల చెయ్యగా దానిని చూసి నెటిజెన్లు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు..అదేమిటి అంటే ఈ మేకింగ్ వీడియో లో పులి కి బదులుగా ఒక మనిషి బ్లూ మత్ కలర్ డ్రెస్ వేసుకొని ఎన్టీఆర్ మీదకి దూకుతాడు..దీనిని రాజమౌళి vfx తో నిజమైన పులి తో ఫైట్ చేస్తునట్టు చిత్రీకరించి అందరిని ఆశ్చర్యపొయ్యేలా చేసాడు..ఈ సన్నివేశం మరియు ఇంటర్వెల్ అప్పుడు ఎన్టీఆర్ క్రూర మృగాలతో బండి మీద నుండి దూకే షాట్..ఈ రెండు సన్నివేశాలు థియేటర్ లో చూసే ఆడియన్స్ కి గూస్ బంప్స్ తప్పించాయి..దీని వెనుక రాజమౌళి విజన్ మరియు ఆయన డిజైన్ చేసిన VFX షాట్స్ కి సెల్యూట్ చెయ్యాల్సిందే.

నేడు హాలీవుడ్ ఆడియన్స్ నుండి ఈ సినిమాకి వస్తున్నా అద్భుతమైన రెస్పాన్స్ చూస్తుంటే కచ్చితంగా వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో #RRR కి చోటు దక్కడం ఖాయం అనిపిస్తుంది..కనీసం రెండు మూడు విభాగాలలో ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్స్ రావడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అనే చెప్పాలి..రాజమౌళి తన ప్రతి సినిమాతో మన తెలుగు సినిమా మార్కెట్ ని ఎవ్వరు ఊహించని స్థాయికి తీసుకెళ్లి పెట్టడం..నిజంగా మన తెలుగు జాతికి గర్వకారణం అనే చెప్పొచ్చు..ఇక ఈ సినిమాలో హీరోలు గా నటించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే అవుతుంది..ఇద్దరు వారి వారి పాత్రలలో నటించడం కాదు..జీవించారు అనే చెప్పాలి..ముఖ్యంగా నాటు నాటు సాంగ్ లో వీళ్లిద్దరు వేసిన స్టెప్స్ కి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించింది..ఈ సినిమా తర్వాత వీళ్లిద్దరు రేంజ్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…