
భారతదేశ సినీ ప్రియులు మొత్తం ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మూవీ మేనియా లో ఎలా మునిగి తేలుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మార్చ్ 25 వ తారీఖున దేశ వ్యాప్తంగా ప్రారంభం అయినా ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రభంజనం నేటికీ ఏ మాత్రం ఊపు తగ్గకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రోజుకో ప్రభంజనం సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతుంది,బాహుబలి సినిమా తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగరాసిన రాజమౌళి ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మూవీ తో దానికి మించిన ప్రభంజనం సృష్టించాడు అనే చెప్పాలి,మొదటి రోజు 234 కోట్ల రూపాయిల గ్రాస్ తో ప్రారంభం అయినా ఈ చిత్రం అతి త్వరలోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోబోతుంది, ఇప్పటి వరుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన సినిమాలు కేవలం రెండు మాత్రమే, ఒక్కటి బాహుబలి పార్ట్ 2 కాగా మరొక్కటి అమిర్ ఖాన్ నటించిన దంగల్, ఈ రెండు సినిమాల తర్వాత అతి త్వరలోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరబోతోంది రాజమౌళి ఆర్ ఆర్ ఆర్.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రకి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ముఖ్యంగా ఈ పాత్ర గెటప్ శ్రీ రాముడిని పోలి ఉండడం తో నార్త్ ఇండియా లో ఒక్క రేంజ్ రీచ్ వచ్చింది అనే చెప్పాలి, రామ్ చరణ్ ఆ పాత్రని ఎంతో అద్భుతంగా పోషించడం తో ఆయన క్రేజ్ కూడా అక్కడ ఒక్క రేంజ్ లో పెరిగింది అనే చెప్పాలి, అక్కడి జనాలు ఇప్పుడు బాలీవుడ్ లో ఎవరైనా రామాయణం తీస్తే అందులో కచ్చితంగా రామ్ చరణ్ కి రాముడి రోల్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు అంటే ఆయన పోషించిన రామరాజు క్యారక్టర్ ప్రభావం జనాల్లో ఎలా ఉందొ ఊహించుకోవచ్చు , ఇది ఇలా ఉండగా అల్లూరి సీత రామ రాజు అంటే నిన్న మొన్నటి వరుకు కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు,ఆ రేంజ్ లో ఆయన తెలుగు సినిమాలో అల్లూరి పాత్రతో తనదైన ముద్రని జనల గుండెల్లో వేసాడు, ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే ఇటీవలే కృష్ణ గారు ఆర్ ఆర్ ఆర్ మూవీ ని చూశాడట, ఈ సినిమా చూసిన తర్వాత ఆయన చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ మూవీ చూసాను, రాజమౌళి మరోసారి తెలుగోడి సాతాని ప్రపంచం నలుమూలలా విస్తరింపులా చేసాడు, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఎంతో అద్భుతంగా నటించారు, చాలా సన్నివేశాలు నాకు కూడా రోమాలు నిక్కపొడుకునేలా చేసాయి , రామ్ చరణ్ కి అల్లూరి సీత రామ రాజు గెటప్ చాలా బాగా సెట్ అయ్యింది,నాటి తరం లో అల్లూరి సీత రామ రాజు అంటే అందరూ నన్నే చూపేవారు, నేటి తరం లో అల్లూరి సీతారామ రాజు అంటే రామ్ చరణ్ అని అందరూ కొన్ని ఏళ్ళు కచ్చితంగా అనుకుంటారు అని ఆశిస్తున్నాను, ఈ చిత్రం విజయం సాధించినందుకు యూనిట్ సభ్యులు అందరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు సూపర్ స్టార్ కృష్ణ,బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతున్న ఈ సినిమా ఎక్కడి వరుకు వెళ్లి ఆగుతుందో చూడాలి.