
దాదాపు గా నాలుగేళ్ల నుండి సినీ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సెన్సషనల్ మూవీ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం, షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు రేపు ప్రపంచ వ్యాప్తంగా అన్ని బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది, రాజమౌళి షూటింగ్స్ విషయం లో ఎక్కడ తగ్గకుండా ఎలా అయితే ఉంటాడో, ప్రొమోషన్స్ విషయం లో కూడా అదే స్థాయి లో తగ్గేదెలా అనే విధంగా ఉంటాడు, ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రొమోషన్స్ కోసం ఆయన ఇద్దరు హీరోలతో కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ప్రతి చోట ఇంటర్వూస్ లు ఇస్తున్నాడు, ఆయన ఇంటర్వ్యూ ఇవ్వని ఛానెల్ అంటూ ఏది మిగలలేదు అంటే ఏ మాత్రం అతిసయోక్తి కాదు,వాస్తవానికి ఈ సినిమాకి పెద్దగా ప్రొమోషన్స్ ఏమి అక్కర్లేదు అనే చెప్పాలి, ఎందుకంటే ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి మాస్ హీరోలు ఉన్నారు, అగ్ని కి ఆజ్యం తోడు అయినట్టు రాజమౌళి లాంటి నెంబర్ 1 ఇండియన్ డైరెక్టర్ ఉన్నాడు, వీళ్ళ బ్రాండే ఈ సినిమాకి ఒక్క పెద్ద ప్రమోషన్, కానీ రాజమౌళి ఎక్కడ తగ్గకుండా ఈ సినిమా ప్రొమోషన్స్ విషయం లో ఊపిరి సలపనంతా బిజీ గా గడుపుతున్నాడు అంటే ఆయనకీ సినిమా అంటే ఎలాంటి ప్యాషన్ అనేది అర్థం చేసుకోవచ్చు.
నాలుగేళ్లు హీరోలిద్దరు పడిన కష్టానికి తగినట్టే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కనివిని ఎరుగని రేంజ్ లో జరుగుతున్నాయి, హైదరాబాద్ లో ఈ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ నుండే 15 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది అంటే ఈ సినిమా కోసం జనాలు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు , కేవలం నైజం ఏరియా నుండే ఈ సినిమా దాదాపుగా మొదటి రోజు పాతిక కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం, ఇక సీడెడ్ లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ప్రస్తుతం ఈ సినిమాకి సీడెడ్ లో ఉన్న క్రేజ్ మరియు డిమాండ్ చూస్తుంటే కచ్చితంగా 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల అంచనా, ఇదే కనుక జరిగితే ఈ సినిమా మొదటి రోజు రికార్డ్స్ ని ఇతర హీరోలు అందుకోవడానికి కనీసం ఒక్క పదేళ్లు పట్టొచ్చు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు,ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కి ట్రేడ్ వర్గాలు వస్తున్న అంచనా చూస్తుంటే మైండ్ పోవడం ఖాయం.
కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఈ సినిమాకి దాదాపుగా 80 నుండి 90 కోట్ల రూపాయిల షేర్ వచ్చే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల అంచనా, ఇక ఓవర్సీస్ ప్రీమియర్స్ అయితే ఇప్పటికే కేవలం ప్రీ సేల్స్ నుండే దాదాపుగా 3 మిలియన్ డాలర్లు వచ్చాయి, ఇక ప్రీమియర్స్ మొత్తం పూర్తి అయ్యే సరికి ఈ సినిమా 5 మిలియన్ డాలర్లు అందుకునే అవకాశం ఉంది అని విస్వసనీయ వర్గాల సమాచారం, ఇది ఒక్క ఆల్ టైం జిజాన్టిక్ రికార్డు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, ఇక బాలీవుడ్ లో కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కనివిని ఎరుగని రేంజ్ లో జరిగాయి, మొదటి రోజు ఇక్కడ పాతిక కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం, తమిళం మరియు కన్నడ వెర్షన్ ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఒక్క రేంజ్ లో ఉండేసరికి ఈ సినిమా కేవలం ఒక్క రోజులోనే 180 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది, ఇప్పటి వరుకు బాహుబలి మినహా మన తెలుగు సినిమాలు దేనికి కూడా 180 కోట్ల దాటి షేర్ ఫుల్ రన్ లో కూడా రాలేదు, ఇది కేవలం ఒక్క రోజులోనే ఆ మార్కుని అందుకోబోతుండడం తో ట్రేడ్ వర్గాలు అన్ని ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యాయి.