Home Entertainment #RRR మూవీ 13 రోజుల వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

#RRR మూవీ 13 రోజుల వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
276

ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర దర్శక ధీరుడు రాజమౌళి తెరకేకించిన భారీ మల్టీస్టార్ర్ర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ ఎంతతి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కనివిని ఎరుగని రేంజ్ అంచనాలతో విడుదల అయినా ఈ ఇనెమ మొదటి రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తూ ముందుకి దూసుకుపోతుంది,తోలి రోజే దాదాపుగా 240 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చితం, అదే ఊపుతో ముందుకి పొత్తూరి బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసే దిశగా ముందుకు పోతుంది, ఇప్పటి వరుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో కేవలం బాహుబలి పార్ట్ 2 మరియు దంగల్ సినిమాలు మాత్రమే 1000 కోట్ల రూపాయిల మార్కుని అందుకుంది, ఇప్పుడు ఆ లిస్ట్ లోకి అతి త్వరలోనే చేరబోతోంది ఆర్ ఆర్ ఆర్ చిత్రం, ఈ సినిమా 13 రోజులకు గాను ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

మొదటి వారం అద్భుతమైం వసూళ్లను బాక్స్ ఆఫీస్ వద్ద నమోదు చేసిన ఈ చిత్రం , రెండవ రోజు కూడా అదే స్థాయి వసూళ్లతో బాక్స్ ఆఫీస్ ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపొయ్యే రేంజ్ వసూళ్లను నమోదు చేస్తూ ముందుకు దూసుకుపోయింది, హిందీ లో ఈ సినిమా ఇప్పటి వరుకు దాదాపుగా 200 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది,ఇప్పటి వరుకు ఇక్కడ బాహుబలి పార్ట్ 2 మినహా ఒక్క సినిమా కూడా మన టాలీవుడ్ నుండి 200 కోట్ల రూపాయిల మార్కుని అందుకోలేదు,బాహుబలి పార్ట్ 2 తర్వాత మల్లి రాజమౌళి సినిమానే ఆ మార్కుని అందుకోవడం నిజంగా మన తెలుగోడు గర్వించదగ్గ విషయం, ఒక్క హిందీ లో మాత్రమే కాదు తమిళం మరియు మలయాళం వంటి బాషలలో కూడా ఈ సినిమా ప్రభంజనం సృష్టు ముందుకు దూసుకుపోతుంది, మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అన్ని భాషలకు 13 రోజులకు గాను 940 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు 500 కోట్ల రుపాయిలకు పైగా షేర్ ని వసూలు చేసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో బాహుబలి పార్ట్ 2 తర్వాత బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రం గా నిలిచింది, ఈ సినిమా కేవలం వీకెండ్స్ లో మాత్రమే కాదు వర్కింగ్ డేస్ లో కూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతుంది, ఇటీవల కాలం లో ఈ స్థాయి లాంగ్ రన్ ఉన్న సినిమా మరొకటి లేదు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఈ సినిమాకి నైజం ఏరియా లో ఎలాంటి అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఇక్కడ ఈ సినిమా ఏకంగా 100 కోట్ల రూపాయిల షేర్ ని సాధించి సరికొత్త ప్రభంజనం సృష్టించింది, ఒక్క ప్రాంతం లో వంద కోట్ల రూపాయిల షేర్ అంటే మాములు విషయం కాదు, మన టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి వంద కోట్ల రూపాయిల షేర్ వస్తే ఒక్క అద్భుతమైన అఛీవ్మెంట్ లా ఫీల్ అవుతున్న ఈ రోజుల్లో, కేవలం నైజాం ప్రాంతం నుండి వంద కోట్ల రూపాయిలు వసూలు చెయ్యడం అంటే ఒక్క అద్భుతం అనే చెప్పాలి, ఈ సినిమా నైజం ఏరియా హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దాదాపుగా 75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు, కేవలం 12 రోజుల్లోనే పాతిక కోట్ల రూపాయిల లాభాలు రావడం తో ఈ దిల్ రాజు ఫుల్ జోష్ మీద ఉన్నాడు, దీనితో ఆయన ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం కి ఒక్క ప్రత్యేకమైన పార్టీ ని ఇచ్చాడు, ఈ పార్టీ కి ఆర్ ఆర్ ఆర్ మూవీ టీం తో పాటుగా, ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు అందరూ హాజరు అయ్యారు, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి రాజమౌళి వేసిన నాటు నాటు స్టెప్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…