
తెలుగు చలన చిత్ర పరిశ్రమ ని శిఖరాగ్ర స్థాయిలో నిలబెట్టిన సినిమాలలో ఒక్కటి దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడం లో నూటికి నూరు పాళ్ళు సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి..ఇక ఈ ఒక్క సినిమా తో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..నిన్న మొన్నటి వరుకు కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితం అయినా వీళ్ళ స్టార్ స్టేటస్ ఒక్క సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో వెళ్ళిపోయింది..ఇక నుండి వీళ్ళు తమ కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఎవ్వరు అందుకోలేని స్థానం కి చేరుకుంటారు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..సుమారు నాలుగు వారల పాటు సాగిన #RRR మూవీ బాక్స్ ఆఫీస్ జైత్ర యాత్ర ఇప్పుడు చివరి దశకి చేరుకుంది అనే చెప్పాలి..KGF చాప్టర్ 2 ప్రభంజనం ప్రారంభం అయ్యాక #RRR మూవీ థియేటర్స్ మొత్తం దేశ వ్యాప్తంగా భారీగా తగ్గిపోయాయి..అందు వాళ్ళ ఈ సినిమా డ్రీం రన్ ఇక చివరి దశకి చేరుకుంది అని ట్రేడ్ వర్గాల అంచనా..ఒక్కసారి ఈ సినిమా ఫుల్ రన్ లో అన్ని భాషలకు కలిపి ఎంత వసూలు చేసింది అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
విడుదల రోజు నుండి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే నైజం ఏరియా లో ఈ సినిమా ఇప్పటి వరుకు 110 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఇది మన టాలీవుడ్ స్టార్ హీరోలకు ప్రపంచవ్యాప్తంగా వచ్చే వసూళ్లు తో సమానం అని చెప్పవచ్చు..భవిష్యత్తు లో కూడా ఈ రికార్డు ని మరో హీరో ఎవ్వరు కూడా ముట్టుకోలేరు అని ట్రేడ్ వర్గాల అంచనా..బాహుబలి సినిమా తర్వాత ఈ ప్రాంతం లో అలాంటి ప్రభంజనం సృష్టించిన సినిమా ఇదే కావడం విశేషం..ఒక్క నైజం ప్రాంతం లో మాత్రమే కాదు..ఈ సినిమా సీడెడ్ లో కూడా ఎవ్వరు అందుకోలేని సరికొత్త బెంచ్ మార్కుని సృష్టించి సంచలనం సృష్టించింది, ఈ ప్రాంతం లో ఇక్కడ ఈ సినిమా దాదాపుగా 52 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఉంటుంది అని ట్రేడ్ వర్గాల అంచనా..మళ్ళీ ఈ కలెక్షన్స్ ని అందుకోవాలి అంటే రాజమౌళి సినిమాకి మాత్రమే సాధ్యం అని తెలుస్తుంది,అలా ఉత్తరాంధ్ర లో 36 కోట్ల రూపాయిలు , నెల్లూరు లో 9 కోట్ల రూపాయిలు ,ఈస్ట్ గోదావరి జిల్లాలో 15 కోట్ల రూపాయిలు మరియు వెస్ట్ గోదావరి జిల్లాలో 13 కోట్ల రూపాయిలు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా 260 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఉంటుంది అని ట్రె వర్గాల అంచనా.
ఇక హిందీ లో అయితే ఈ సినిమా దాదాపుగా 255 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసి సరికొత్త ప్రభంజనం సృష్టించింది..బాహుబలి సినిమా తర్వాత ఇక్కడ ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన దబ్ మూవీ ఇదే..KGF చాప్టర్ 2 లెకపొయ్యి ఉంటె కచ్చితంగా ఈ సినిమా క్లోసింగ్ 270 రూపాయిలు అయ్యి ఉండేది అట..ఇక తమిళనాడు లో కూడా ఈ సినిమా దాదాపుగా 40 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చెయ్యగా, కర్ణాటక లో 36 కోట్ల రూపాయిలు, అలాగే కేరళ లో 12 కోట్ల రూపాయిలు షేర్ ని వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా ఒక్క ప్రభంజనం అనే చెప్పాలి..ఇక్కడి నుండి ఈ సినిమా దాదాపుగా 110 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఉంటుంది అని అంచనా..మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 1100 కోట్ల రూపాయిల గ్రాస్ కి గాను 600 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది అని డిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్.