Home Entertainment #RRR మూవీ కలెక్షన్స్ ని దాటేసిన కన్నడ చిత్రం ‘కాంతారా’

#RRR మూవీ కలెక్షన్స్ ని దాటేసిన కన్నడ చిత్రం ‘కాంతారా’

0 second read
0
0
706

కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసిన కాంతార మూవీ డబ్బింగ్ ఈనెల 15న టాలీవుడ్‌లో విడుదలైంది. ఎలాంటి హ‌డావుడి లేకుండా సైలెంట్‌గా థియేట‌ర్లలోకి వ‌చ్చిన ఈ మూవీ ప్రస్తుతం క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో బాక్సాఫీస్ దగ్గర ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. ఇప్పుడు ప్ర‌తి సినీ ల‌వ‌ర్ నోటి నుంచి కాంతార పేరు మాత్ర‌మే వినిపిస్తుందంటే ఈ సినిమా ఫీవ‌ర్ జ‌నాల్లో ఎలా ఎక్కేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంతార మూవీకి సంబంధించి తెలుగులో డ‌బ్బింగ్ రైట్స్ తీసుకున్న గీతా ఆర్ట్స్‌ సంస్థ నక్క తోక తొక్కిందని ట్రేడ్ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే కర్ణాటకలో పలు రికార్డులను ఈ మూవీ కొల్లగొడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించిన రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా రికార్డులను సైతం కాంతార అధిగమిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. ఈ మూవీ 17వ రోజు వరల్డ్ వైడ్‌గా రూ.22 కోట్లు మాత్రమే వసూలు చేయగా కాంతార మూవీ మాత్రం విడుదలైన 17వ రోజు అన్ని వెర్షన్‌లలో కలుపుకుని రూ.25 కోట్లు వసూలు చేసి అదిరిపోయే రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక ఐఎండీబీ రేటింగ్ సాధించిన భారత చిత్రంగా కాంతార రికార్డులకు ఎక్కింది. ఇప్పటి వరకు టాప్‌లో ఉన్న కేజీఎఫ్ 2 చిత్రాన్ని కాంతార వెనక్కి నెట్టి మొదటి స్థానం కైవసం చేసుకుంది. కాంతార చిత్రానికి ఐఎండీబీలో అత్యధికంగా 9.5 రేటింగ్ దక్కింది. మొన్నటి వరకు టాప్‌లో ఉన్న కేజీఎఫ్ 2 రెండో స్థానానికి పడిపోయింది. 8.5 ఐఎండీబీ రేటింగ్‌తో కేజీఎఫ్ చాప్టర్ 2, 8 రేటింగ్‌తో ఆర్.ఆర్.ఆర్ మొదటి రెండు స్థానాల్లో ఉండేవి. ఇప్పుడు కాంతార ధాటికి టాలీవుడ్ టాప్ మూవీ ఆర్.ఆర్.ఆర్ మూడో స్థానానికి పరిమితమైంది.

భూమిపై ఆధిపత్యం అనే కాన్సెప్ట్‌తో కాంతార చిత్రం తెరకెక్కింది. హీరో రిషబ్ శెట్టి స్వయంగా రచించి దర్శకత్వం వహించి నటించాడు. ఈ క్రమంలో ఒక అద్భుత చిత్రాన్ని తెరకెక్కించిన రిషబ్ శెట్టి పేరు మార్మోగిపోతోంది. కాంతార ఆయనకు నటుడిగా, దర్శకుడిగా భారీ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఫుల్ రన్‌లో అన్ని భాషల్లో కాంతార మూవీ ఎన్ని కోట్ల వసూళ్లు రాబడుతుందో అన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను చూసి పలువురు సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల కాంతార మూవీని చూసిన కోలీవుడ్ క్రేజీ స్టార్‌ హీరో ధనుష్ సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఈ సినిమా చూశాక త‌న మైండ్ బ్లాక్ అయ్యింద‌ని, అద్భుతంగా ఉంద‌ని, ప్ర‌తిఒక్క‌రూ క‌చ్ఛితంగా చూడాల్సిన సినిమా అని ధనుష్ ట్వీట్ చేశాడు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…