Home Entertainment #RRR మరియు KGF రికార్డ్స్ ని చిత్తు చిత్తు చేసిన కమల్ హాసన్ విక్రమ్ సినిమా

#RRR మరియు KGF రికార్డ్స్ ని చిత్తు చిత్తు చేసిన కమల్ హాసన్ విక్రమ్ సినిమా

4 second read
0
0
1,055

ఈ ఏడాది విడుదలైన #RRR మరియు KGF చాప్టర్ 2 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని బాషలలో ఎలాంటి సెన్సషనల్ హిట్స్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వసూళ్లను కొల్లగొట్టాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ రెండు సినిమాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన సినిమాలే..మన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఖ్యాతిని మరో మెట్టు ఎక్కించిన సినిమాలు ఇవి..ఈ రెండు సినిమాలు తర్వాత పాన్ ఇండియా లెవల్ లో ప్రభంజనం సృష్టించిన మరో సినిమా కమల్ హాసన్ హీరో గా నటించిన విక్రమ్ సినిమా..ఖైదీ మరియు మాస్టర్ వంటి సెన్సషనల్ హిట్ సినిమాల తర్వాత ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా ఓపెనింగ్స్ దగ్గర నుండి ఫుల్ రన్ వరుకు అద్భుతమైన వసూళ్లను రాబట్టింది..దశావతారం సినిమా తర్వాత సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న కమల్ హాసన్ కి ఈ సినిమా ఇచ్చిన కిక్ మామూలుది కాదు అనే చెప్పాలి..మధ్యలో విశ్వరూపం పార్ట్ 2 సినిమాని నిర్మించి తీవ్రమైన నష్టాలను చవి చూసిన కమల్ హాసన్..ఈ సినిమా వల్ల అప్పులు తీర్చడం కోసం తన ఆస్తులను మొత్తం తాకట్టు పెట్టుకోవాల్సి వచ్చిందట.

అలా ఆర్థికంగా ఎంతో చితికిపోయిన కమల్ హాసన్ మరోసారి రిస్క్ చేసి విక్రమ్ సినిమా తీసాడు..నేడు ఆ సినిమా నుండి వస్తున్న వసూళ్లతో ఆయన తన అప్పులన్నీ కట్టుకొని ప్రశాంతం గా జీవిస్తున్నాను అని ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా ఇప్పుడు ఎంతో కాలం నుండి చెక్కు చెదరకుండా పదిలంగా ఉన్న బాహుబలి 2 రికార్డ్స్ ని బద్దలు కొట్టడమే కాకుండా..ఇటీవల విడుదలైన #RRR , KGF సినిమాల రికార్డ్స్ ని కూడా కొట్టేసి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసింది..కమల్ హాసన్ హిట్ కొడితే ఈ స్థాయిలో ఉంటుందా అని ఆయన దురాభిమానులు సైతం ముక్కు మీద వేలేసుకునేలా చేసింది విక్రమ్ సినిమా..ఓపెనింగ్స్ దగ్గర నుండి ఇప్పటి వరుకు ఈ సినిమా ఎంత వసూలు చేసింది..ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టింది..భవిష్యత్తులో ఇంకా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

మొదటి రోజు ఏకంగా 60 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే 160 కోట్ల రూపాయిల గ్రాస్ ని మరియు 83 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసింది..ఇది ఒక్క సెన్సషనల్ రికార్డు అని చెప్పొచ్చు..అలా తొలి వీకెండ్ లో అద్భుతమైన వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం వీక్ డేస్ లో కూడా అదే జోరుని కొనసాగించింది..అలా ప్రభంజనం సృష్టిస్తూ ముందుకి దూసుకుపోయిన ఈ సినిమా తొలి వారం లోనే 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది..అంతే కాకుండా ఈ సినిమా తమిళనాడు లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచినా #RRR మరియు KGF చాప్టర్ 2 వంటి సినిమాల వసూళ్లను కూడా దాటి ఏకంగా బాహుబలి 2 రికార్డుని కూడా కొట్టేసింది..బాహుబలి 2 సినిమా తమిళనాడు లో దాదాపుగా 155 కోట్ల రూపాయిలు వసూలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తర్వాత అజిత్ నటించిన విశ్వాసం సినిమా 145 కోట్ల రూపాయిలు వసూలు చేసి టాప్ 2 స్థానం లో ఉన్నది..కానీ కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా 17 రోజుల లోపే బాహుబలి రికార్డు ని బద్దలు కొట్టి 160 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ఫుల్ రన్ లో ఈ సినిమా 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ఆశ్చర్య పోనక్కర్లేదు అని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు..మరి విక్రమ్ బాక్స్ ఆఫీస్ ప్రభంజనం ఎంత వరుకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : విడాకులు తీసుకున్న నిహారిక కొణిదెల – చైతన్య..గుండెలు పగిలేలా ఏడుస్తున్న నాగబాబు

ఈమధ్య కాలం లో సెలెబ్రిటీలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది.సమంత – నాగ చైతన…