Home Entertainment #RRR నుండి తొలగించిన అద్భుతమైన సన్నివేశం ఎక్సక్లూసివ్ గా మీకోసం

#RRR నుండి తొలగించిన అద్భుతమైన సన్నివేశం ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
20,231

తెలుగు సినిమా ఖ్యాతిని దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచం నలుమూలల బాహుబలి సినిమాతో ఎలా మారుమోగిపోయ్యేలా చేసాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఈ సినిమా తర్వాత ఆయన తెరకెక్కించే ఏ సినిమాకి అయినా అంచనాలు కనివిని ఎరుగని రేంజ్ లో ఉంటాయి అనే సంగతి మనం ఊహించవచ్చు,ఆ అంచనాలను మ్యాచ్ చెయ్యడం అంటే మాములు విషయం కాదు అనే చెప్పాలి, కానీ అందరిలాంటి దర్శకుడు అయితే కాదు కదా రాజమౌళి , మన అంచనాలకు ఆయన ఎప్పుడు అందడు, బాహుబలి సినిమా తర్వాత ఆయన ఏకంగా ఈ జనరేషన్ మాస్ హీరోలు అయినా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తో కలిసి మల్టీస్టార్ర్ర్ చేస్తున్నాను అని పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చారు,ఈ కాంబినేషన్ కి పర్కాటించిన రోజు నుండే అంచనాలు ఎవ్వరు ఊహించని స్థాయికి వెళ్లాయి , ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా కనివిని ఎరుగని రేంజ్ బిజినెస్ తో ఇటీవలే విడుదల అయ్యి సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే, రోజుకి 100 కోట్ల రూపాయల చొప్పున గ్రాస్ ని వసూలు చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర పెను విస్ఫోటనం ని సృష్టించింది ఈ సినిమా.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి మొదటి రోజు నుండి ఎన్టీఆర్ ఫాన్స్ లో కాస్త నిరాశ ఏర్పడిన సంగతి మన అందరికి తెలిసిందే,ఎందుకంటే ఈ సినిమా మొత్తం రామ్ చరణ్ వైపే ఉంది అని, ఎన్టీఆర్ ని సపోర్టింగ్ రోల్ లా ఈ సినిమాలో చూపించారు అని ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియా లో రాజమౌళి ని టాగ్ చేస్తూ తమ నిరాశని వ్యక్తపరిచారు, ఈ విషయం చిత్ర యూనిట్ వరకు వెళ్ళింది, దీనితో ఎడిటింగ్ సమయం లో నిడివి దృష్ట్యా తొలగించిన కొన్ని ఎన్టీఆర్ సన్నివేశాలు అతి త్వరలోనే సినిమాలో జతపర్చడానికి చూస్తున్నారు అట మూవీ టీం , ఇదే కనుక జరిగితే ఎన్టీఆర్ ఫాన్స్ కి పండగే అని చెప్పొచ్చు, మరోసారి వాళ్ళందరూ ఈ కొత్త సన్నివేశాల కోసం థియేటర్ లో రిపీట్ వెయ్యొచ్చు అని ట్రేడ్ వర్గాల అంచనా, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కేవలం మొదటి వారం లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న ఈ సినిమా, భవిష్యత్తులో ప్రెస్టీజియస్ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోబోతుందా లేదా అనేది చూడాలి.

ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పటి వరుకు కనివిని ఎరుగని రేంజ్ లో కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్ల రుపాయిల గ్రాస్ ని వసూలు చేసి చరిత్ర సృష్టించింది, ఒక్క ఇండియాలోనే కాదు, ఇతర దేశాలలో కూడా ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తుంది, అమెరికా లో అయితే ఈ సినిమా ప్రభంజనం ముందు హాలీవుడ్ మూవీస్ కూడా పనికి రాలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు, రెండవ రోజు ఈ సినిమా దాదాపుగా 20 లక్షల డాలర్లు వసూలు చేసి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు ని నెలకొల్పింది,అమెరికా లో ఈ సినిమా హక్కులను 12 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయగా కేవలం రెండు రోజుల్లోనే 8 మిలియన్ డాలర్స్ కి పైగా వసూలు చేసి మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే దిశగా దూసుకుపోతుంది,ఫుల్ రన్ లో ఈ సినిమా కేవలం అమెరికా నుండే 20 మిలియన్ డాలర్స్ వసూలు చేసే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం,నార్గ్వా రోజు కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్థిరంగా నిలబడితే ఫుల్ రన్ లో కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాల అంచనా, మరి ఈ టార్గెట్ ని ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సింగర్ వాణి జయరాం మృతి పై తలెత్తుతున్న అనుమానాలు..!

కన్నడతో పాటు పలు భాషల్లో 10,000కు పైగా పాటలు పాడిన నటి వాణీ జయరామ్ ఈరోజు (ఫిబ్రవరి 4) చెన్…