Home Entertainment #RRR నుండి తొలగించిన అద్భుతమైన సన్నివేశాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం

#RRR నుండి తొలగించిన అద్భుతమైన సన్నివేశాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
14,635

తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు మరోసారి తీసుకెళ్లిన సినిమా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టార్ర్ర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్, ఈ సినిమా కోసం అటు మెగా అభిమానులు ఇటు నందమూరి అభిమానులు ఎంతలా ఎదురు చూసారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, దాదాపుగా నాలుగేళ్ల పాటు వాళ్ళు చూసిన ఎదురు చూపులకు ఈ సినిమా మంచి తృప్తి ని ఇచ్చింది అనే చెప్పాలి, ముఖ్యంగా హీరోలిద్దరు చేసిన నటనకి యావత్తు భారత దేశం సినీ అభిమానులు జేజేలు పలికింది అనే చెప్పాలి, దాదాపుగా 500 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 12 రోజుల్లోనే 900 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది, బాహుబలి తర్వాత ఆ స్థాయి వసూళ్లు ఈ సినిమాకే రావడం విశేషం,ఒక్క తెలుగు లోనే కాదు హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో కూడా ఈ సినిమా ఒక్క ప్రభంజనం సృష్టించింది అనే చెప్పాలి, ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక్క ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు నిడివి దృష్ట్యా తొలగించి వెయ్యాల్సి వచ్చింది అట,అప్పటికే ఈ సినిమా నిడివి మూడు గంటలు దాటడం తో రాజమౌళి అండ్ టీం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది, అయితే సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ఒక్క రేంజ్ లో ఉండడం తో త్వరలో ఈ సన్నివేశాలను కూడా యాడ్ చేసే ఆలోచనలో ఆ చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది, ఈ సన్నివేశాలు సినిమాలో జతపర్చిన తర్వాత మరింత లాంగ్ రన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది, రామ్ చరణ్ మరియు అలియా భట్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలతో పాటు , అడవి లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ మరియు మల్లి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలను కూడా జతపర్చబోతున్నట్టు తెలుస్తుంది, ఈ సన్నివేశాలు ఈ వారం లో యాడ్ చేస్తారా లేదా వచ్చే వారం చేస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది,మన అందరికి తెలిసిందే, సినిమాకి బిజినెస్ ఎలా రప్పించాలి అనే అంశం పై రాజమౌళి ఒక్క మాస్టర్ మైండ్ అని, ఈ వీకెండ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి భారీ స్థాయిలో వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుండడం తో వచ్చే వారం లో కాస్త కలెక్షన్లు డౌన్ అయ్యే అవకాశం ఉంది అని, కాబట్టి వచ్చే వారం ఈ సన్నివేశాలు యాడ్ చేస్తే సినిమాకి అదనంగా మరో 30 కోట్ల రూపాయిల షేర్ లాంగ్ రన్ లో వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకి నైజం ఏరియా లో ఎలాంటి అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఇక్కడ ఈ సినిమా ఏకంగా 100 కోట్ల రూపాయిల షేర్ ని సాధించి సరికొత్త ప్రభంజనం సృష్టించింది, ఒక్క ప్రాంతం లో వంద కోట్ల రూపాయిల షేర్ అంటే మాములు విషయం కాదు, మన టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి వంద కోట్ల రూపాయిల షేర్ వస్తే ఒక్క అద్భుతమైన అఛీవ్మెంట్ లా ఫీల్ అవుతున్న ఈ రోజుల్లో, కేవలం నైజాం ప్రాంతం నుండి వంద కోట్ల రూపాయిలు వసూలు చెయ్యడం అంటే ఒక్క అద్భుతం అనే చెప్పాలి, ఈ సినిమా నైజం ఏరియా హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దాదాపుగా 75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు, కేవలం 12 రోజుల్లోనే పాతిక కోట్ల రూపాయిల లాభాలు రావడం తో ఈ దిల్ రాజు ఫుల్ జోష్ మీద ఉన్నాడు, దీనితో ఆయన ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం కి ఒక్క ప్రత్యేకమైన పార్టీ ని ఇచ్చాడు, ఈ పార్టీ కి ఆర్ ఆర్ ఆర్ మూవీ టీం తో పాటుగా, ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు అందరూ హాజరు అయ్యారు, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి రాజమౌళి వేసిన నాటు నాటు స్టెప్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

 

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…