
తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి మాస్ హీరోలు కలిసి మల్టీస్టార్ర్ర్ సినిమా చెయ్యడం తో ఈ సినిమా పై ప్రారంభం నుండే కనివిని ఎరుగని రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి, కానీ ఆ అంచనాలు అన్నిటిని మించి ఈ సినిమా కి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం,మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 230 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది, మన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల క్లోసింగ్ కూడా ఈ స్థాయిలో ఉండదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, ఒక్క తెలుగు మాత్రమే కాకుండా హిందీ తమిళం మలయాళం ఇలా అన్ని బాషలలో ఈ సినిమా రికార్డు వసూళ్లను దక్కించుకుంటూ సెన్సేషన్ సృష్టిస్తుంది, ఆర్ ఆర్ ఆర్ సినిమా ఓపెనింగ్ రికార్డ్స్ ని కొట్టాలంటే కనీసం పదేళ్లు పెట్టె రేంజ్ లో ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ అభిమానులకు గూస్ బంప్స్ రప్పించే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి అనే చెప్పాలి , ఇంటర్వెల్ ఫైట్ లో ఈ కొదమ సింహాలు లాగ ఈ ఇద్దరు చేసుకునే ఫైట్ అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేసాయి,ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఇద్దరి హీరోల మధ్య వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు అభిమానులకు మాత్రమే కాదు యావత్తు సినీ అభిమానికి కంటతడి పెట్టించేలా చేసింది,ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే కొమరం భీముడొ పాటలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇద్దరు కలిసి చూపించిన అభినయం చూపురలకు కంటతడి పెట్టేలా చేసింది, ఇక రామ్ చరణ్ ని ఎన్టీఆర్ జైలు నుండి తప్పించే సన్నివేశం అయితే ఇప్పటి వరుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఎప్పుడు చూడలేదు అని చెప్పొచ్చు, ఎన్టీఆర్ బుజం మీద రామ్ చరణ్ ఎక్కి చేసే ఫైట్ సీన్ థియేటర్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా ప్రతి సన్నివేశం ఒక్క డైమండ్ అని చెప్పొచ్చు .
మొదటి రోజు ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండవ రోజు కూడా అదే స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ని దక్కించుకుంది,ముఖ్యంగా నైజం ఏరియా లో ఈ సినిమా ఆకాశమే హద్దుగా ముందుకి దూసుకుపోతుంది, మొదటి రోజు దాదాపుగా 23 కోట్ల రూపాయిల షేర్ ని సాధించిన ఈ సినిమా, రెండవ రోజు కూడా అదే స్థాయి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది అని తెలుస్తుంది, కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా నైజం ఏరియా లో 60 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల అంచనా, నైజం ఏరియా లో ఈ సినిమాని 70 కోట్ల రూపాయలకు కొనుగోలు చెయ్యగా కేవలం వారం లోపే ఆ మొత్తాన్ని వసూలు చేసే అవకాశం ఉంది ట్రేడ్ వర్గాల అంచనా, సోమవారం కలెక్షన్లు స్థిరంగా నిలబడితే ఫుల్ రన్ లో ఈ సినిమా కేవలం నైజం ఏరియా నుండే దాదాపుగా 100 కోట్ల రూపాయిల షేర్ కొల్లగొట్టే అవకాశం ఉంది అని తెలుస్తుంది, మరి ఈ సినిమా రేంజ్ ఎలా ఉండబోతుందో చూడాలి.