
తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వపడే స్థాయికి మరో సారి తీసుకెళ్లిన చిత్రం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం , అభిమానులు మరియు ప్రేక్షకులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఆ అంచనాలను దాటి తియ్యడం రాజమౌళి స్పెషల్ , ఆర్ ఆర్ ఆర్ విషయం లో కూడా ఆయన అలాగే చేసాడు , నిర్మాత పెట్టిన ప్రతి పైసా వెండితెర మీద కనిపించేలా చేస్తూ , రూపాయికి పది రూపాయిల లాభాలు రప్పించేంత సత్తా ఉన్న దర్శకుడు రాజమౌళి, నేడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే అతి పెద్ద పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అనడం లో ఎలాంటి సందేహం లేదు, రాజమౌళి సినిమా అంటేనే ఒక్క బ్రాండ్ జనాల్లో అలా ఉండిపోయింది అని చెప్పొచ్చు,ఇక ఈ సినిమా అతి త్వరలోనే ప్రెస్టీజియస్ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు చేసిన సినిమాల లిస్ట్ లోకి చేరబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే, సినిమా యూనిట్ మొత్తం సక్సెస్ ని ఒక్క రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు అనే చెప్పాలి.
ఇక ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ ని మొత్తం ఇద్దరు హీరోలు రాజమౌళికి ఇస్తున్నారు, ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే ఈ సినిమా వసూళ్ల విషయం ని అసలు పట్టించుకోవట్లేదు అట, ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో ఆయనని ఒక్క యాంకర్ ఇదే ప్రశ్న గురించి అడగగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘ ఈ సినిమా నా కెరీర్ లో ఒక్క మైలు రాయిగా నిలిచిపోయింది,ఈ సినిమా తర్వాత నుండి ఎన్టీఆర్ కెరీర్ ని ఆర్ ఆర్ ఆర్ కి ముందు ఆర్ ఆర్ ఆర్ కి తర్వాత గా చూడవచ్చు, నటుడిగా నాకు ఎంతో సంతృప్తి పరిచే పాత్ర ఇచ్చినందుకు రాజమౌళి గారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను,ఇక ఈ సినిమా కలెక్షన్స్ గురించి నేను అసలు పట్టించుకోవట్లేదు, అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో సంతృప్తి చెందారు, చూసినోళ్లే పడే పడే థియేటర్స్ కి వచ్చి చూస్తున్నారు, ఈ తృప్తి ముందు కలెక్షన్స్ ఎంత ‘ అంటూ చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్, ఆయన పోషించిన కొమరం భీం పాత్రకి దేశ వ్యాప్తంగా ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక ఈ సినిమాకి నైజం ఏరియా లో ఎలాంటి అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఇక్కడ ఈ సినిమా ఏకంగా 100 కోట్ల రూపాయిల షేర్ ని సాధించి సరికొత్త ప్రభంజనం సృష్టించింది, ఒక్క ప్రాంతం లో వంద కోట్ల రూపాయిల షేర్ అంటే మాములు విషయం కాదు, మన టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి వంద కోట్ల రూపాయిల షేర్ వస్తే ఒక్క అద్భుతమైన అఛీవ్మెంట్ లా ఫీల్ అవుతున్న ఈ రోజుల్లో, కేవలం నైజాం ప్రాంతం నుండి వంద కోట్ల రూపాయిలు వసూలు చెయ్యడం అంటే ఒక్క అద్భుతం అనే చెప్పాలి, ఈ సినిమా నైజం ఏరియా హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దాదాపుగా 75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు, కేవలం 12 రోజుల్లోనే పాతిక కోట్ల రూపాయిల లాభాలు రావడం తో ఈ దిల్ రాజు ఫుల్ జోష్ మీద ఉన్నాడు, దీనితో ఆయన ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం కి ఒక్క ప్రత్యేకమైన పార్టీ ని ఇచ్చాడు, ఈ పార్టీ కి ఆర్ ఆర్ ఆర్ మూవీ టీం తో పాటుగా, ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు అందరూ హాజరు అయ్యారు, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి రాజమౌళి వేసిన నాటు నాటు స్టెప్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.