
రామ్ చరణ్ శంకర్ ఇద్దరు కలిసి పాన్ ఇండియా లెవెల్ లో మూవీ ప్లాన్ చేసారు, దాని కోసం ప్రస్తుతం RC 15 అని టైటిల్ మాత్రమే ఉంది, మూవీ పేరు ఇంకా అనౌన్స్ చేయలేదు. కియారా అద్వానీని హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు ఈ సినిమా ని నిర్మిస్తున్నాడు. ఒక పోస్టర్ మాత్రమే ఈ సినిమా కి సంబంధించి రిలీజ్ చేసారు, ఇంకా వేరే ఏమి అప్డేట్ లేదు. ఐతే వస్తున్న వార్త ప్రకారం దిల్ రాజు మరియు శంకర్ ఈ సినిమాకి సంబంధించి టైటిల్ రిలీజ్ కోసం భారీ ప్రమోషనల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.
ఐతే దిల్ రాజు తన మరో సినిమా “వారసుడు” తో బిజీ గా ఉన్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. అది అయినా తరువాత రామ్ చరణ్ సినిమా కి సంబంధించి ఈవెంట్ ని భారీగా ప్లాన్ చేయాలి అని నిర్మాణం తీసుకున్నాడు దిల్ రాజు. ఐతే ఆ ఈవెంట్ ముంబై లేదా హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం కొంతమంది పాన్ ఇండియా స్టార్స్ ని ఈ ఈవెంట్ కి తీసుకురానున్నారు . కే. జి ప్ స్టార్ యాష్ మరియు సూర్య ఐతే ప్రస్తుతం ఒప్పుకున్నారు.
వీళ్ళే కాకుండా ఇంకా బడా స్టార్స్ రానున్నారు. దిల్ రాజు శంకర్ కలిసి ఎవరు ఊహించని విధంగా ఈ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన ఒక పోస్టర్ కె ఈ సినిమా బిజినెస్ భారీ లెవెల్ లో జరుగుతుంది. ఓవర్సీస్ హక్కులను సుమారు 15 కోట్లకి అమ్ముడుపోయింది. తెలుగు రాష్ట్రాలలో ఇంకా ప్రయత్నిస్తున్నారు.
వచ్చే నెల ఈ సినిమాకి సంబంధించి కొత్త షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. ఈ షెడ్యూల్ కోసం మూవీ బృదం మొత్తం న్యూజ్లాండ్ వెళ్లనున్నారు. న్యూజ్లాండ్ లో ఒక పాట ని పది రోజులు పాటు షూట్ చేయబోతున్నారు. న్యూజ్లాండ్ లో పలుచోట్ల ఈ పాట ని షూట్ చేయబోతున్నారు. ఈ పాట కోసం దిల్ రాజు ఏకకంగా 8 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాడు అని సమాచారం. మన అందరికి తెలిసిందే శంకర్ ప్రతీ సినిమాలో పాటలకి భారీ బడ్జెట్ మరియు భారీ సెట్స్ వేస్తాడు , తన సినిమాల్లో పాటలే హైలైట్ గా నిలుస్తాయి. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.