Home Entertainment OTT లో #RRR రికార్డ్స్ ని బద్దలు కొట్టిన కార్తికేయ 2

OTT లో #RRR రికార్డ్స్ ని బద్దలు కొట్టిన కార్తికేయ 2

4 second read
0
0
144

ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని షేక్ చేసిన చిత్రాలలో ఒకటి కార్తికేయ 2..యంగ్ హీరో నిఖిల్ నటించిన ఈ సినిమా తెలుగు లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో..హిందీ లో కూడా అదే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..తెలుగు లో సుమారు 30 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా హిందీ లో 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కలిపి ఈ సినిమా 60 కోట్ల రూపాయిల వరుకు షేర్ వసూళ్లను రాబట్టింది..అతి తక్కువ బడ్జెట్ తో ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం అంటే మాములు విషయం కాదు..బాక్స్ ఆఫీస్ వద్ద ఆ రేంజ్ ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా ఇటీవలే OTT లో విడుదల అయ్యింది..ఈ సినిమా డిజిటల్ మరియు సాటిలైట్ హక్కులను జీ తెలుగు వారు మారి మొత్తానికి కొనుగోలు చేసారు.

ఇటీవలే జీ 5 లో స్ట్రీమింగ్ అయినా ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఈ ఏడాది సెన్సషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన #RRR చిత్రం కూడా ఇందులోనే విడుదల అయ్యింది..దానికి రెస్పాన్స్ ఏ రేంజ్ లో వచ్చిందో మన అందరికి తెలిసిందే..జీ 5 ని ఎక్కడికో తీసుకెళ్లి పెట్టింది..ఇప్పుడు కార్తికేయ 2 ఈ యాప్ లో #RRR కి మించిన రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది..కేవలం 24 గంటల్లోనే ఈ సినిమా మూడు మిలియన్ల వాచ్ హావర్స్ వచ్చాయట..మరో విశేషం ఏమిటి అంటే తెలుగు కంటే కూడా హిందీ వెర్షన్ కి ఎక్కువ రెస్పాన్స్ వస్తుందట..నార్త్ ఇండియన్స్ కి దేవుడికి సంబంధించిన సినిమాలు అంటే ఎంత ఇష్టం అనేది మన అందరికి తెలిసిందే..ఈ నేపథ్యం లో వచ్చిన సినిమాలన్నీ కూడా బాలీవుడ్ లో చరిత్రని తిరగ రాస్తున్నాయి..ఇప్పుడు నిఖిల్ కార్తికేయ 2 కూడా అదే కోవెల్లోకి వెళ్లబోతుంది..థియేట్రికల్ పరంగా ఎంత ప్రభంజనం సృష్టించింది..డిజిటల్ స్ట్రీమింగ్ లో అంతకు మించి సెన్సేషన్ సృష్టిస్తుంది ఈ సినిమా.

జీ 5 యాప్ లో #RRR సినిమాకి 24 గంటలకు గాను 18 మిలియన్ల వాచ్ హావర్స్ మాత్రమే వచ్చాయి..కానీ కార్తికేయ 2 కి మాత్రం దాదాపుగా 30 మిలియన్ల వాచ్ హావర్స్ వచ్చాయి..దానికి కారణం హిందీ వెర్షన్ వల్లే అని చెప్పొచ్చు..#RRR హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు కొనుగోలు చేసారు..అక్కడ స్ట్రీమింగ్ అయినా తర్వాత ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మన అందరికి తెలిసిందే..సుమారు 90 మిలియన్ల వాచ్ హావర్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది..మన ఇండియన్స్ కంటే ఇతర దేశాలకు చెందిన వారే ఈ సినిమాని ఎగబడి చూసారు..ఇప్పటికి కూడా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతూనే ఉంది..#RRR హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో కాకుండా జీ 5 యాప్ లో రిలీజ్ చేసి ఉంటె ఈరోజు #RRR సినిమా ఎవ్వరు టచ్ చెయ్యలేని రికార్డు గా మిగిలిపోయేదని..చెయ్యలేదు కాబట్టే ఈ సినిమా రికార్డు ని కార్తికేయ 2 కొట్టేసింది అంటూ ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…