Home Entertainment OTT లో సూపర్ హిట్ గా నిలిచి లాభాల వర్షం కురిపించిన ఆచార్య సినిమా

OTT లో సూపర్ హిట్ గా నిలిచి లాభాల వర్షం కురిపించిన ఆచార్య సినిమా

4 second read
0
1
14,262

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ఇటీవలే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పాలైన సంగతి మన అందరికి తెలిసిందే..కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం లో రామ్ చరణ్ కూడా ఒక్క ముఖ్యమైన పాత్ర పోషించిన సంగతి మన అందరికి తెలిసిందే..తండ్రి కొడుకులు కలిసి నటిస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లోనే కాదు..ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి..కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది..కొరటాల శివ తనకి ఇచ్చిన అమూల్యమైన ఛాన్స్ ని వేస్ట్ చేసాడు అని..ఈ సినిమా లో చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి ఉన్న సన్నివేవాలు ఏవి కూడా అభిమానులకు ఊపు రప్పించలేదు అని , మెగాస్టార్ కెరీర్ లోనే ఇంత చెత్త సినిమా ని ఎప్పుడు చూడలేదు అని అభిమానులు పెదవి విరిచారు..కనీసం ఓపెనింగ్స్ ని కూడా దక్కించుకొని ఈ సినిమా ఫుల్ రన్ లో కేవలం 48 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసి చిరంజీవి కెరీర్ లో భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

థియేట్రికల్ బిజినెస్ లో బయ్యర్స్ కి చావు దెబ్బ కొట్టిన ఈ సినిమా ఇటీవలే OTT లో విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా OTT హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు దాదాపుగా 18 కోట్ల రూపాయలకు కౌనుగోలు చేసారు..ముందుగా ఈ సినిమా థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంటేనే OTT లో విడుదల చెయ్యాలి అని అగ్రిమెంట్ చేసుకున్నారు..కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం తో ముందుగా OTT లో విడుదల చేసుకునే అవకాశం కల్పిస్తే 18 కోట్ల రూపాయిల భారీ ఆఫర్ ఇస్తాము అని అమెజాన్ ప్రైమ్ వారు ముందుకి రావడం తో మూడు వారాలకే OTT లో విడుదల చేసారు..రెస్పాన్స్ మాత్రం అద్భుతంగా వచ్చింది అనే చెప్పాలి.కేవలం ఒక్క రోజులోనే ఈ సినిమా ని అమెజాన్ ప్రైమ్ లో 30 లక్షల మంది వీక్షించారు అని..ఇది ఒక్క ఆల్ టైం రికార్డు అని చెప్పుకొచ్చారు..థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా OTT లో బ్లాక్ బస్టర్ గా నిలవడం చూస్తూ ఉంటె మెగాస్టార్ చిరంజీవి కి ఫామిలీ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ , భోళా శంకర్ మరియు వాల్తేరు వీరయ్య వంటి సినిమాల్లో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..వీటిల్లో గాడ్ ఫాదర్ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది..మలయాళం సూపర్ హిట్ గా నిలిచినా లూసిఫెర్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒక్క ముఖ్య పాత్రలో నటిస్తున్నారు..ఇందులో సల్మాన్ ఖాన్ మరియు చిరంజీవి కలిసి చేసే పాట షూటింగ్ ఒక్కటే ప్రస్తుతం బాలన్స్ ఉంది అట..నయన తార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు..ఆగష్టు నెలలో ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ,మరియు హిందీ బాషలలో విడుదల చెయ్యనున్నారు అట.ఈ సినిమా తర్వాత ఆయన చేస్తున్న భోళా శంకర్ సినిమా షూటింగ్ కూడా 70 శాతం పూర్తి అయ్యింది..మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు..ఆచార్య సినిమాతో అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచిన మెగాస్టార్ చిరంజీవి రాబొయ్యే చిత్రాలతో కచ్చితంగా అలరిస్తాడు అని అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…