
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఇటీవల విడుదలయ్యి ఎంత పెద్ద సెన్సషనల్ హిట్ గా నిలిచింది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,పబ్లిక్ లో ఈ సినిమాకి డివైడ్ టాక్ ఉన్నప్పటికీ కూడా పవర్ స్టార్ స్టామినా తో ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది అనే చెప్పాలి,మొదటి వారం 90 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో 105 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది,ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి లాభాల వర్షం కురిసింది అనే చెప్పాలి, బాక్స్ ఆఫీస్ పరంగా ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీ లో కూడా విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే, ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా ఒక్కేసారి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు ఆహ మీడియా లో విడుదల అయ్యింది, వెండితెర మీద అద్భుతమైన రికార్డ్స్ ని సృష్టించిన ఈ సినిమా, ఓటీటీ లో కూడా సరికొత్త రికార్డ్స్ ని సృష్టించింది.
ఆహ మీడియా లో ఈ సినిమా కేవలం 24 గంటల్లోనే 100 మిలియన్ మినిట్స్ వ్యూస్ దక్కించుకొని ఆల్ టైం ఇండియన్ రికార్డుగా నిలిచింది, ఇక దిశనే ప్లస్ హాట్ స్టార్ లో కూడా ఈ సినిమాకి దాదాపుగా 100 మిలియన్ మినిట్ వ్యూస్ వచ్చాయి అని తెలుస్తుంది,మొత్తం మీద ఈ సినిమాకి రెండు ఓటీటీ చానెల్స్ కి కలిపి దాదాపుగా 200 మిలియన్ మినిట్ వ్యూస్ కేవలం 24 గంటల్లోనే వచ్చాయి అని తెలుస్తుంది,ఇప్పట్లో ఈ రికార్డు బ్రేక్ అవ్వడం కష్టమే అని ట్రేడ్ వర్గాల్లో గట్టిగ వినిపిస్తున్న వార్త, ఇక ఒక్క పక్క హాట్ స్టార్ వాళ్ళు మరో పక్క ఆహ మీడియా వాళ్ళు చాలా కాలం తర్వాత పవర్ స్టార్ సినిమాని కొనడం తో,ప్రొమోషన్స్ విషయం లో ఎక్కడ తగ్గలేదు అనే చెప్పాలి, ముఖ్యంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో భీమ్లా నాయక్ సినిమా కోసం ప్రత్యేకంగా చేయించిన ఒక్క సెట్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది, ఆ ఫోటో ని మీరు క్రింద ఎక్సక్లూసివ్ గా చూడవచ్చు.
ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు క్రిష్ తో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, 50 శాతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కార్యకమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి తర్వలోనే సరికొత్త షెడ్యూల్ ను ప్రారంబించబోతుంది,ఇప్పటి వరుకు ఈ తెరకెక్కించిన సన్నివేశాలు అన్ని అద్భుతంగా వచ్చాయి అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త, ఇది వరుకు మనం ఎప్పుడు కూడా చూడని పవన్ కళ్యాణ్ ని ఈ సినిమా ద్వారా చూడబోతున్నాము అని, కచ్చితంగా ఈ సినిమా అభిమానులకు రోమాలు నిక్కపొడిచేలా చేస్తోంది అని ట్రేడ్ చాలా గట్టిగా వినిపిస్తున్న వార్త, ఈ సినిమా పూర్తి ఆయిన్ తర్వాత ఆయన గబ్బర్ సింగ్ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్జ్ అనే సినిమాని చేస్తున్నారు , జూన్ నెల నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.