Home Entertainment OTT లో కూడా ప్రభంజనం సృష్టించిన KGF చాప్టర్ 2..ఒక్క రోజులో ఎంత వసూలు చేసిందో తెలుసా?

OTT లో కూడా ప్రభంజనం సృష్టించిన KGF చాప్టర్ 2..ఒక్క రోజులో ఎంత వసూలు చేసిందో తెలుసా?

0 second read
0
1
11,080

కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం కేజీఎఫ్. ఇది అనూహ్య విజయం సాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ తీశారు. కేజీఎఫ్ చాప్టర్ 2 పేరుతో ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. ఈ సినిమా 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా నాలుగు రెట్ల లాభాలతో రూ.వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దర్శక ధీరుడు రాజమౌళి సినిమా ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమాను సైతం బీట్ చేసింది. అంతే కాకుండా హిందీ వర్షన్‌‌లో ఏకంగా దంగల్ సినిమానే బీట్‌ చేసిందంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ స్థాయిలో ఘనమైన వసూళ్లు సాధించిన కేజీఎఫ్ 2 మూవీని వారం కిందట ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో పే పర్ వ్యూ సిస్టమ్‌లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాను చూడాలంటే ప్రేక్షకులు రూ.199 కట్టాల్సి ఉంటుంది.

అయితే థియేటర్లలో రికార్డుల వర్షం కురిపించిన కేజీఎఫ్ 2 ఓటీటీలో కూడా భారీ స్థాయిలో వ్యూయర్ షిప్ రాబట్టినట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాకు ఒక్కరోజులో 30 లక్షల వ్యూస్ వచ్చాయని.. తద్వారా రూ.150 కోట్ల వసూళ్లు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అమెజాన్ వారు ఈ సినిమా భారీ ధరను వెచ్చించి డిజిటల్ హక్కులను కొనుగోలు చేశారు. ఇప్పుడు పే పర్ వ్యూ సిస్టమ్ ద్వారా వాళ్లకు మూడింతలు లాభం వచ్చినట్లు టాక్ నడుస్తోంది. అటు ఓటీటీలో రెంట్‌కు అందుబాటులోకి తెచ్చినా ఇంకా థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను వీక్షిస్తున్నారు. ముఖ్యంగా మాస్ సెంటర్లలో సింగిల్ స్క్రీన్‌ థియేటర్లలో ఈ సినిమా ఇంకా అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల నుండి ప్రతి రోజు 10 లక్షలకు పైగా షేర్‌ వస్తుందని ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

ఈ సినిమా విడుదలై దాదాపు 6 వారాలు దాటుతున్నా ఇంకా ఈ స్థాయిలో ప్రదర్శింపబడటం గొప్ప విషయం. అందులోనూ రోజు పది లక్షల షేర్‌ అంటే మామూలు విషయం కాదు. ఇంకా నెట్‌ గ్రాస్ వసూళ్లు ఎన్ని ఉండి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. కేజీఎఫ్ 2 తర్వాత ఇటు హీరో యష్, అటు దర్శకుడు ప్రశాంత్‌ నీల్ పాన్‌ ఇండియా స్టార్లుగా మారిపోయారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు వీరితో వర్క్‌ చేయడం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా హిందీ వెర్షన్ ఇప్పటి వరకు రూ.400 కోట్లకు పైగా వసూలు చేసిందని ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు. బాహుబలి-2 తర్వాత ఆ స్థాయిలో హిందీలో వసూళ్లు రాబట్టిన దక్షిణాది సినిమాగా కేజీఎఫ్ సెకండ్ చాప్టర్ రికార్డులకెక్కింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా మొత్తం భారతీయ బాక్సాఫీస్‌ను ఈ మూవీ షేక్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి రూ. 78 కోట్ల బిజినెస్ చేయగా.. రూ. 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగి రూ. 84.06 కోట్ల షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…