
మన టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు..బ్రహ్మోతవం మరియు స్పైడర్ వంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత మహేష్ బాబు స్క్రిప్ట్ సెలక్షన్ పూర్తిగా మారింది..ఆ రెండు ఫ్లాప్ సినిమాల తర్వాత మహేష్ బాబు తన కెరీర్ ఫ్లాప్ అంటే ఏమిటో కూడా మర్చిపోయాడు..ఆ సినిమాల తర్వాత ఆయన చేసిన భరత్ అనే నేను, మహర్షి , సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాలు మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి..ఇక రీసెంట్ గా విడుదల అయినా సర్కారు వారి పాట సినిమాకి యావరేజి టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ స్టేటస్ ని అందుకుంది..దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు..మహేష్ బాబు కి ఫామిలీ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది..మాములు సినిమాని కూడా బ్లాక్ బస్టర్ ని చెయ్యడం ఒక్క సూపర్ స్టార్ మహేష్ బాబు కి మాత్రమే సాధ్యం అని ఈ సినిమా తో తేలిపోయింది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా OTT హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు కొనుగోలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో రెంట్ పద్దతి లో విడుదల చేసారు..అంటే ఈ సినిమా మీ ఇంట్లో కాళ్ళు మీద కాళ్ళు ఏసుకొని ఫామిలీ తో చూడాలి అంటే 199 రూపాయిలు కట్టాలి అన్నమాట..గతం లో KGF చాప్టర్ 2 ని అలాగే విడుదల చేసారు..దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చి అమెజాన్ ప్రైమ్ వారికి మంచి లాభాలను తెచ్చిపెట్టింది..ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాకి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది అట..కేవలం 24 గంటల్లోనే ఈ సినిమాకి రెంటెడ్ పద్దతి లో 5 లక్షల వ్యూస్ వచ్చాయి అట..అంటే దాదాపుగా ఒక్క రోజులోనే కోటి రూపాయిలు వచ్చింది అన్నమాట..ఇది టాలీవుడ్ లో ఒక్క ఆల్ టైం రికార్డుగా చెప్పుకోవచ్చు..ఈ నెల 9 వ తేదీ నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ యూజర్స్ అందరికి అందుబాటులో రానుంది..ఈ గాప్ లో ఈ సినిమా రెంటల్స్ నుండే 5 కోట్ల రూపాయిలు వసూలు చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది.
ఇక మహేష్ బాబు త్వరలోనే దర్శక ధీరుడు రాజమౌళి తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..వచ్చే ఏడాది చివరి నుండి ఈ సినిమా ప్రారంభం కానుంది..అయితే ఈలోపు మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక్క సినిమా కమిట్ అయ్యాడు..వచ్చే నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది..ప్రస్తుతం మహేష్ బాబు హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చెయ్యడం లో భాగంగా జర్మనీ కి కుటుంబం తో వెళ్లిన సంగతి మన అందరికి తెలిసిందే..త్రివిక్రమ్ ఈరోజు ఫైనల్ స్క్రిప్ట్ ని న్యారేట్ చేసేందుకు ఆ చిత్ర నిర్మాత సూర్య దేవర నాగ వంశి తో కలిసి జర్మనీ కి వెళ్ళాడు..పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా..థమన్ సంగీతం అందిస్తున్నాడు..ఇక ఈ సినిమా లో మహేష్ బాబు తో పాటుగా ఒక్క యంగ్ హీరో నటించే అవకాశం ఉంది అట..ఇక విలన్ పాత్ర కోసం అయితే విజయ్ సేతుపతి కోసం ప్రయత్నిస్తున్నారు..భారీ తారాగణం తో తెరకెక్కబోతున్న ఈ సినిమా మహేష్ కెరీర్ లో ఒక్క ల్యాండ్ మార్క్ గా మిగిలిపోతుంది అట.