
ఇప్పుడు ఉన్న సినిమా పరిశ్రమ ల అన్నింటి లోను అత్యధిక పారితోషకం తీసుకుంటున్న వారి లో మన తెలుగు సినిమా పరిశ్రమ కి సంబంధించిన హీరో లు ఎక్కువ గా కనిపిస్తున్నారు.ప్రభాస్ అందిరికంటే ఎక్కువ గా 100 కోట్ల వరకు తీసుకుంటున్నారు ,తర్వాత స్దాన ల లో పవన్ కళ్యాణ్ ,మహేష్ ,అల్లు అర్జున్ ,రామ్ చరణ్ ,ఎన్టీఆర్ లు ఉన్నారు.కానీ ఇప్పుడు భారత సినీ చరిత్ర లోనే అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరో గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిలిచారు..మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన పని లేదు ,ఆయన ఒక్క సారి థియేటర్ లో కనిపిస్తే చాలు ,పెద్ద పెద్ద స్టోరీ లు కానీ ,పెద్ద తారాగణం కానీ అవసరం లేదు . అభిమానులు ఆయనని ఒక ఆరాధ్య దైవం ల భావిస్తారు ,అందుకే హిట్టు ,ప్లాప్ తో పని లేకుండా అయన సినిమా లు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ అవుతుంటాయి.
దానికి ఇటీవల కాలం లో రిలీజ్ అయినా బీమ్లా నాయక్ ,వకీల్ సాబ్ సినిమా లే ఉదాహరణ.అందరి హీరోస్ కి ఉన్నట్లు టికెట్స్ రేట్స్ లేవు ,బెనిఫిట్ షోస్ లేవు ,కొత్త స్టోరీ లు ఏమి కావు ,కేవలం పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ మీద బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించాయి.అయితే ఫాన్స్ అందరు ఇంకా ఈ రీమేక్ సినిమా లు వద్దు అని కోరుకుంటున్న సమయం లో ,మరల ఇంకో రీమేక్ తో రాబోతున్నారు.ప్రస్తుత పరిస్థితులలో ఎక్కువ రోజులు షూటింగ్ కి డేట్స్ ఇవ్వలేక మంచి కంటెంట్ ఉండి,ఆల్రెడీ హిట్ అయినా సినిమా ని రీమేక్ చేస్తున్నారు..తమిళ సూపర్ హిట్ అయినా ‘వినోదయ్యా సీతం’ సినిమా లో ఉన్న కోర్ పాయింట్ ని మాత్రమే తీసుకుని పవన్ కళ్యాణ్ గారి స్టైల్ లో మార్పులు చేసి తీస్తున్నారు..ఈ సినిమా కి రచయత ,మాటలు అందిస్తుంది ‘గురూజీ త్రివిక్రమ్ ‘ గారు.పవన్ కళ్యాణ్ గారి తో పాటు అయన మేన అల్లుడు సుప్రీం స్టార్ సాయి తేజ్ నటిస్తున్న ఈ సినిమా కి వెర్సటైల్ యాక్టర్ మరియు దర్శకుడు అయినా సముద్ర ఖని గారు దర్శకత్వం చేస్తున్నారు.
ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు కేవలం 20 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారు అంట,ఈ 20 రోజుల కోసం పవన్ కళ్యాణ్ గారు 60 కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకోబోతున్నారు .ఇది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో అల్ టైం రికార్డు అని అంటున్నారు.దీన్ని బట్టి చూస్తే ఒక రోజు కి పవన్ కళ్యాణ్ గారికి 3 కోట్ల రూపాయల పారితోషకం అందబోతున్నది.తాను ఇలా సంపాదించిన డబ్బుల తో తన పార్టీ కార్యక్రమ ల కి ,కార్యకర్త ల సంక్షేమము కోసం ఈ మధ్యనే కోటి రూపాయలు విరాళం ఇచ్చారు ,రైతు ల కి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు.అయినా ప్రత్యర్థుల నుంచి విమర్శలు రావడం దురదృష్టం.ఇక పోతే ఈ సినిమా 90 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి ,ఈ ఇయర్ లోనే థియేటర్స్ లో లో తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.మరి ఈ సినిమా ఏ స్థాయి లో కలెక్షన్స్ రాబడుతోందో చూడాలి.