Home Entertainment KGF 2 పై నోరు పారేసుకున్న డైరెక్టర్ కి నెటిజెన్స్ ఎలాంటి గతి పట్టించారో చూడండి

KGF 2 పై నోరు పారేసుకున్న డైరెక్టర్ కి నెటిజెన్స్ ఎలాంటి గతి పట్టించారో చూడండి

0 second read
0
0
170

ప్రతి ఇండస్ట్రీ లో ను విబేధాలు ,భిన్న అభిప్రాయాలూ వస్తూనే ఉంటాయి మరి ఎక్కువ గా సినిమా ఇండస్ట్రీలో విభేదాలు తరచుగా వస్తూనే ఉంటాయి.హీరో ,హీరోయిన్ లు ఈ విబేధాల కి కొంచెం దూరంగా ఉన్నపటికీ దర్శకులు మాత్రం ఈ విబేధాల మీద పడుతుంటారు. ఒక దర్శకుడు తీసిన సినిమాలపై మరొక దర్శకుడు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి కొంత మంది మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. తాజాగా దర్శకుడు వెంకటేష్ మహా అలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చకున్నారు వెంకటేష్. లైఫ్ యాంథాలజీ గా వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత సత్యదేవ్ హీరోగా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ వంటి డిఫరెంట్ జోనర్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇటీవల ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘కేజీఎఫ్ 2’ సినిమా అందులో హీరో యష్ పాత్రపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అటు సోషల్ మీడియాలోనూ ఆయనపై ట్రోల్స్ వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

KGF Yash's 'Rocky Bhai' Character Abused By Director Venkatesh Maha During  A Round Table Interview, Gets Bashed By Netizens As One Says “Apologise To  Him"

ఇటీవల దర్శకుడు వెంకటేష్ మహా ఒక యూట్యూబ్ ఛానల్ లోని ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో ఆయనతో పాటు దర్శకులు నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహనకృష్ణ, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. ఇండియన్ బ్లాక్ బ్లస్టర్ సినిమా ‘కేజీఎఫ్’ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమలాంటి దర్శకులు తమ అభ్యుదయ భావాలను పక్కనపెట్టి సినిమాలు చేస్తే అంతకంటే గొప్ప సినిమాలు తీయగలం అని అన్నారు. కానీ, తాము అలాంటి సినిమాలు చేయడం లేదని, విలువలతో కూడిన సినిమాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాంటి సినిమాలను కూడా డిగ్రేడ్ చేస్తున్నారని, అవి ఓటీటీ సినిమాలు అని అంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇండైరెక్టుగా ‘కేజీఎఫ్ 2’ సినిమాను కోడ్ చేస్తూ ఒక సినిమా ఉంది. అందులో హీరో తల్లి కొడుకుని గొప్ప వాడు అవ్వాలని చెబుతుందని, మళ్లీ ఆ కొడుకు తల్లికు బంగారం తెస్తానని మాట ఇస్తాడు. అందుకోసం బంగారం తవ్వే వద్దకు వెళ్తాడు. అక్కడ వాళ్లను ఉద్దరిస్తాడు. మళ్లీ చివర్లో ఆ బంగారం తీసేవాళ్లందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఆ బంగారం మొత్తం ఒక చోట పడేస్తాడు. అలాంటి గొప్పవాడు అవ్వమని ఆ తల్లి చెప్పడం. అలాంటి సినిమాను గొప్ప సినిమా అంటూ మనం ఎగబడి చూసేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు.

దర్శకుడు వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలోనూ దీనిపై ట్రోల్స్ జరుగుతున్నాయి. వెంకటేష్ వ్యాఖ్యలపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే కొంత మంది నెటిజన్స్ దర్శకుడి మాటలకు మద్దతు ఇస్తుండగా మరికొంత మాత్రం ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. దర్శకుడు వెంకటేష్ మహా వెంటనే హీరో యష్ కు, దర్శకుడు ప్రశాంత్ నీల్ కు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ఆయన సినిమాలను కన్నడలో బ్యాన్ చేస్తామంటూ ఫైర్ అవుతున్నారు. వేరే దర్శకుడి సినిమాలు నచ్చకపోతే చూడటం మానేయాలని అంతేగాని ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని పలువురు హితవు పలుకుతున్నారు. మరి వెంకటేష్ మహా వ్యాఖ్యలపై హీరో యష్, ప్రశాంత్ నీల్ ఎలా స్పందిస్తారో చూడాలి.ఒకరి మీద ఒకరు ఇలా భిన్న అభిప్రాయ లు కలిగి ఉన్నపటికీ చివరికి ప్రేక్షకులు ఇచ్చే తీర్పు మీదనే సినిమా విజయం ,అపజయం ఆధారపడి ఉంటుంది అని గ్రహిస్తే ఎలాంటి ఆరోపణలు చేయరు.

Venkatesh Maha opens up on his acting tryst, ahead of Disney+ Hotstar  Telugu anthology 'Anger Tales' - The Hindu

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ తో పెళ్ళికి ముందు ఉపాసన ఆ హీరోతో ఇంత ప్రేమాయణం నడిపిందా..? బయటపడ్డ షాకింగ్ నిజం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,ఉపాసన కామినేని 2012 వ సంవత్సరం లో వివాహం చేసుకున్నారు, వీర…