
దేశ వ్యాప్తంగా KGF చాప్టర్ 2 అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతుందో మనం చూస్తూనే ఉన్నాము..డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హీరోయిజమ్ కి సరికొత్త నిర్వచనం అంటే ఏమిటో ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలియచేసాడు..సినిమాకి పొరసన్త నీల్ గారి టేకింగ్ ఎంత అద్భుతంగా అనిపించిందో..అగ్నికి ఆజ్యం తోడు అయినట్టు ఆయన రాసిన అద్భుతమైన స్క్రిప్ట్ కి సంగీతం అందించిన రవి బస్రుర్ గారి సంగీతం కూడా ఈ సినిమాకి ప్రాణం పోసింది..ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలకు రవి బస్రుర్ గారు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్స్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా మన బుర్రలో తిరుగుతూనే ఉంటుంది..ఈరోజు KGF సిరీస్ ఇంత పెద్ద సంచలన విజయాలు సాధించాయి అంటే దానికి రవి బస్రుర్ గారు అందించిన మ్యూజిక్ కూడా ఒక్క కారణం అని చెప్పొచ్చు..ఇంతకీ ఎవరు ఈ రవి బస్రుర్..నిన్న మొన్నటి వరుకు కేవలం కన్నడ చలన చిత్ర పరిశ్రమకి మాత్రమే పరిమితం అయినా ఈ చిన్న సంగీత దర్శకుడు..నేడు ప్రపంచం మొత్తం మెచ్చుకునే సంగీత దర్శకుడిలా ఎలా ఎదిగాడు..అసలు అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనే దానిపై ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూడబోతున్నాము.
రవి బస్రుర్ కర్ణాటక లోని ఉడిపి జిల్లాలో కుందాపురం అనే ఒక్క చిన్న గ్రామం లో దేవుడి సామాన్లను తయారు చేసుకునే ఒక్క సాధారణ వ్యక్తికీ జన్మించాడు..అతని ప్రాంతం మొత్తం ఎల్లపుడు దేవుడి ప్రారతనాలు, కీర్తనలు మరియు సంగీతం తో నిండిపోయాయి ఉండేది..అలా చిన్నప్పటి నుండి సంగీతం మీద మక్కువ ని పెంచుకుంటూ వచ్చాడు రవి బస్రుర్..చిన్నప్పటి నుండి రవి కి చదువు పెద్దగా అబ్బేది కాదు అట..8 వ క్లాస్ తర్వాత 9 వ క్లాస్ ని వదిలేసి నేరుగా 10 వ తరగతి పరీక్షలు రాసాడు అట..పరీక్షలు రాసిన తర్వాత తాను ఫెయిల్ అయ్యాడా పాస్ అయ్యాడా అనేది కూడా పట్టించుకోకుండా తనకి 14 ఏళ్ళ వయస్సు వచ్చినప్పుడు బెంగళూరు కి వెళ్లి విగ్రహాల తయారీని నేర్చుకున్నాడు..చిన్నప్పటి నుండి మ్యూజిక్ మీద మంచి పట్టు ఉండడం తో ఆయన కన్నడ సినిమాలలో సంగీతం వాయించడానికి ఆ వయస్సు నుండే అవకాశాల కోసం వేట మొదలు పెట్టాడు..రవి లోని ప్రతిభ ని గుర్తించిన ప్రముఖ కన్నడ సంగీత దర్శకులు , వారి సినిమాలకి కీ బోర్డు ప్లేయర్ గా రవి ని పెట్టుకునేవారు..అలా సినిమాల్లో అవకాశం వచ్చినప్పటికీ కూడా తాను నేర్చుకున్న శిల్ప తయారీ వృత్తిని వదలకుండా పగులు శిల్పాలను తయారు చేసే పని కి పోతే సాయంత్రం కీ బోర్డు వాయించడానికి వెళ్ళేవాడు..అలా మెల్లిగా రవి గారి టాలెంట్ ని అర్థం గమనించిన దర్శకులు మరియు నిర్మాతలు ఆయనకీ మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు.
ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాకముందు ,మ్యూజిక్ డైరెక్టర్ అయినా తర్వాత కూడా తాను నేర్చుకున్న శిల్ప కళ ని మాత్రం వదలలేదు..KGF విడుదల అయ్యి పెద్ద హిట్ అయినా తర్వాత ఆయనకీ నేషనల్ వైడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో అవకాశాలు వచ్చాయి..ఎంతో ఎత్తుకి ఎదిగాడు..అయినా కూడా కరోనా సమయం లో లాక్ డౌన్ విధించినప్పుడు తన సొంత ఊరుకి వెళ్లి , అక్కడ తన తండ్రితో కలిసి దేవుడి సమన్లు తయారు చేసేవాడు..ఒక్క వస్తువు తయారు చేసేందుకు 35 రూపాయలు ఇస్తారు ..అలా ఒక్కో సినిమాకి కోట్ల రూపాయిలు సంపాదించే రావు బస్రుర్ లాక్ డౌన్ సమయం లో కేవలం 35 రూపాయిల కోసం కూడా పని చేసేవాడు..అలా ఎంత ఎదిగిన మన మూలాలు మర్చిపోకూడదు అనే దానికి నిదర్శనం గా నిలిచి కోట్లాది మన ఆదర్శంగా నిలిచాడు రవి బస్రుర్..ఈయన నుండి మనం నేర్చుకోవలసినవి చాలానే ఉన్నాయి..ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు..రవి బస్రుర్ పని తీరు నచ్చి టాలీవుడ్ , బ్లవుడ్ మరియు కోలీవుడ్ లో కూడా అవకాశాలు వెల్లువలాగా కురుస్తున్నాయి..మరి ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ భవిష్యత్తు లో ఇంకా ఎన్ని శిఖరాలను అధిరోహించబోతున్నాడో చూడాలి.