
ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద KGF చాప్టర్ 2 సృష్టిస్తున్న కలెక్షన్ల సునామి ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మొదటి రోజు నుండి నేటి వరుకు ఈ సినిమా చేస్తున్న బాక్స్ ఆఫీస్ విద్వాంసం ఎవ్వరి ఊహకి అందని విధంగా ఉంటూ వస్తుంది..ముఖ్యంగా బాలీవుడ్ ట్రేడ్ పండితులు అయితే ఈ సినిమాకి వీక్ డేస్ లో కూడా వస్తున్నా ఆ వసూళ్లను చూసి నోరెళ్లబెడుతున్నారు..ఒక్కటి మాత్రం మనం మెచ్చుకోక తప్పదు..తొలినుండి నార్త్ ఇండియా వాళ్లకి సౌత్ సినిమాలు అంటే ఒక్క రకమైన చిన్న చూపు..కన్నడ సినిమా ఇండస్ట్రీ ని అయితే వాళ్ళు రీమేక్ వుడ్ గా పిలుస్తారు..అంతటి చిన్న చూపు ఉన్న ఒక్క ఇండస్ట్రీ ని ప్రపంచ పటం లో KGF సినిమా ద్వారా పెట్టేలా చేసాడు ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్..అలా మన సౌత్ ఇండస్ట్రీ ని తక్కువగా చూసినప్పుడల్లా తమ దర్శకత్వ ప్రతిభ తో బాలీవుడ్ కి నోర్లు ముయ్యించేలా చేసారు మన దర్శకులు రాజమౌళి , శంకర్ మరియు లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్..ఇది కాసేపు పక్కన పెడితే ఈ సినిమా మొదటి వారం ఇప్పటి వరుకు ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
మొదటి రోజే 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా మొదటి వీకెండ్ లో అదే ఊపు ని కొనసాగిస్తూ కేవలం 4 రోజల్లోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 540 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఈ సినిమా కేవలం 5 రోజులోనే ప్రతిష్టాత్మక 200 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసి ,ఫాస్టెస్ట్ 200 కోట్ల రూపాయిల సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది..ఇక్కడ #RRR ఫుల్ రన్ 260 కోట్ల రూపాయిలు వసూలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ వసూళ్లను KGF చాప్టర్ 2 కేవలం వారం రోజుల్లోనే అధిగమించడం విశేషం..ఇక టాలీవుడ్ లో కూడా ఈ సినిమా ఇక్కడి స్టార్ హీరోలా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు వచ్చే వసూళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా రెవ్క్ర్డ్స్ సృష్టించడం విశేషం..ఒక్క దబ్ సినిమా టాలీవుడ్ లో ఇలాంటి అనితర సాధ్యమైన రికార్డ్స్ పెట్టడం ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు అనే చెప్పాలి..మొదటి వారం ఈ సినిమా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే దాదాపుగా 70 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసినట్టు సమాచారం..ఈ స్థాయి వసూళ్లు ఇప్పటి వరుకు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు మరియు ఏళ్లుగా ర్జున్ వంటి హీరోలకు మాత్రమే ఇక్కడ వచ్చాయి.
ఇక కేరళ బాక్స్ ఆఫీస్ లో అయితే ఈ సినిమా మలయాళం సినిమాల రికార్డ్స్ అన్ని బద్దలు కొడుతూ ప్రభంజనం సృష్టిస్తుంది..తమిళనాడు లో కూడా అక్కడి స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమాకి పోటీ గా దిగి..ఆ మూవీ కలెక్షన్స్ ని సైతం అధిగమించేసింది..ఇక ఓవర్సీస్ లో ఈ సినిమాకి తొలి వారం లో 150 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది..ఈ ప్రాంతం లో KGF వచ్చే వరుకు అసలు కన్నడ సినిమాకి కనీసం రెండు లక్షల డాలర్ల మార్కెట్ కూడా లేదు..కానీ KGF తో కన్నడ పరిశ్రమ ఓవర్సీస్ లో కూడా ఒక్క రేంజ్ లో జెండా పాతేసింది..మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వారం రోజులకు గాను 700 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్..మరియు 400 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసింది ట్రేడ్ వర్గాల అంచనా..మరి కొద్దీ రోజుల్లోనే ఈ సినిమా కూడా వెయ్యి కోట్ల రూపాయిల క్లబ్ లోకి అడుగుపెట్టబోతుంది..ఫుల్ రన్ లో #RRR రికార్డ్స్ ని కొట్టడం అయితే పక్కా..కానీ బాహుబలి 2 కలెక్షన్స్ ని దాటుతుందా లేదా అనేది చూడాలి.