Home Entertainment KGF చాప్టర్ 2 నుండి తొలగించిన అద్భుతమైన సన్నివేశం ఎక్సక్లూసివ్ గా మీకోసం

KGF చాప్టర్ 2 నుండి తొలగించిన అద్భుతమైన సన్నివేశం ఎక్సక్లూసివ్ గా మీకోసం

2 second read
0
2
5,066

ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద KGF చాప్టర్ 2 సృష్టిస్తున్న కలెక్షన్ల సునామి ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మొదటి రోజు నుండి నేటి వరుకు ఈ సినిమా చేస్తున్న బాక్స్ ఆఫీస్ విద్వాంసం ఎవ్వరి ఊహకి అందని విధంగా ఉంటూ వస్తుంది..ముఖ్యంగా బాలీవుడ్ ట్రేడ్ పండితులు అయితే ఈ సినిమాకి వీక్ డేస్ లో కూడా వస్తున్నా ఆ వసూళ్లను చూసి నోరెళ్లబెడుతున్నారు..ఒక్కటి మాత్రం మనం మెచ్చుకోక తప్పదు..తొలినుండి నార్త్ ఇండియా వాళ్లకి సౌత్ సినిమాలు అంటే ఒక్క రకమైన చిన్న చూపు..కన్నడ సినిమా ఇండస్ట్రీ ని అయితే వాళ్ళు రీమేక్ వుడ్ గా పిలుస్తారు..అంతటి చిన్న చూపు ఉన్న ఒక్క ఇండస్ట్రీ ని ప్రపంచ పటం లో KGF సినిమా ద్వారా పెట్టేలా చేసాడు ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్..అలా మన సౌత్ ఇండస్ట్రీ ని తక్కువగా చూసినప్పుడల్లా తమ దర్శకత్వ ప్రతిభ తో బాలీవుడ్ కి నోర్లు ముయ్యించేలా చేసారు మన దర్శకులు రాజమౌళి , శంకర్ మరియు లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్..హీరోయిజం కి సరికొత్త నిర్వచనం చెప్తూ ఎలేవేషన్స్ అంటే ఇలా ఉండాలి అని అందరికి అర్థం అయ్యేలా చేసిన KGF సినిమా నుండి నిడివి దృష్ట్యా కొన్ని సన్నివేశాలను తొలగించేయాల్సి వచ్చింది.

వాస్తవానికి ఆ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా వచ్చినప్పటికి కూడా కథకి కాస్త అడ్డు గా రావడం తో ఆ సన్నివేశాలను ఎడిటింగ్ లో తీసి వేశారు అట డైరెక్టర్ ప్రశాంత్ నీల్..ఇప్పుడు ఆ సన్నివేశాలను అతి త్వరలోనే సినిమాలో జతపర్చబోతున్నట్టు ఇప్పుడు ఫిలిం నగర్ లో ఒక్క వార్త వినిపిస్తుంది..రాకీ భాయ్ చిన్నప్పటి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ లో తన తల్లి తో జరిగిన కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి..ఈ సన్నివేశాలు కొత్తగా యాడ్ చెయ్యడం వల్ల ఫుల్ రన్ లో మరింత వసూలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ట్రేడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న వార్త..అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన హోమబుల్ సంస్థ వారు చెయ్యబోతున్నారు..బాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో ప్రభంజనాలు సృష్టించిన ఈ సినిమా లో ఈ సన్నివేశాలు జతపర్చితే ఈ వీకెండ్ కలెక్షన్స్ ఒక్క రేంజ్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి..తల్లి సెంటిమెంట్ సన్నివేశం తో పాటు ఒక్క బీభత్సమైన ఎలేవేషన్ సన్నివేశం ని కూడా జతపర్చబోతునట్టుయి వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే తోలి వారం 720 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో వెయ్యి కోట్ల రూపాయిల వసూళ్లను అందుకునే దిశగా అడుగులు వేస్తోంది..అన్నీ బాషలలో కంటే ఈ సినిమా హిందీ బాషలోనే ఇరగ కుమ్ముతోంది అని చెప్పొచ్చు..మొదటి వారం లో 270 కోట్ల రూపాయిలు వసూలు చేసిన ఈ చిత్రం , ఈ వీకెండ్ తో 300 కోట్ల రూపాయిల నెట్ మార్కు ని అందుకోనుంది..సౌత్ నుండి ఒక్క బాహుబలి పార్ట్ 2 మినహా ఇప్పటి వరుకు ఈ ప్రాంతం లో 300 కోట్ల రూపాయిల నెట్ ని అందుకున్న సినిమానే లేదు..హిందీ లో అద్భుతమైన వసూలు సాధిస్తున్న ఈ సినిమా తెలుగు లో మాత్రం వీకెండ్ తర్వాత బాగా డల్ అయిపోయింది..79 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం ఇప్పటి వరుకు ఇక్కడ కేవలం 65 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది..బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ సినిమా అందుకోవాలి అంటే ఇంకా 14 కోట్ల రూపాయిలు వసూలు చెయ్యాలి..కానీ ఈ సినిమా ఎంత లాగిన ఈ వీకెండ్ లోనే లాగాలి..ఇక ఆ తర్వాత నుండి పెద్దగా షేర్లు ఏమి రావు అని ట్రేడ్ వర్గాలలో వినిపిస్తున్న వార్త..ఫుల్ రన్ లో ఈ సినిమా ప్రపాంచా వ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకోవడం అయితే పక్కా..కానీ #RRR సాధించిన 1100 కోట్ల రూపాయిల గ్రాస్ రికార్డు ని ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సింగర్ వాణి జయరాం మృతి పై తలెత్తుతున్న అనుమానాలు..!

కన్నడతో పాటు పలు భాషల్లో 10,000కు పైగా పాటలు పాడిన నటి వాణీ జయరామ్ ఈరోజు (ఫిబ్రవరి 4) చెన్…