
ఇండియన్ చలన చిత్ర పరిశ్రమలో KGF సిరీస్ సృష్టించిన ప్రభంజనం ని ఇప్పట్లో ఎవ్వరు మర్చిపోలేరు..హీరోయిజమ్ కి సరికొత్త నిర్వచనం తెలిపిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ప్రస్థానం గురించి సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు..మొదటి భాగం 250 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి కన్నడ సినీ పరిశ్రమ వైపు ప్రతి ఒక్కరు చూసేలా చేస్తే..రెండవ భాగం ఏకంగా 1200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది..ముఖ్యంగా హిందీ లో ఈ సినిమా దాదాపుగా 450 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను సాధించి ఆల్ టైం టాప్ 2 గా నిలిచింది..మొదటి స్థానం లో బాహుబలి పార్ట్ 2 515 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా ఆ స్థాయి వసూళ్లను రాబట్టలేకపోయినప్పటికీ కూడా ఇండియా లో 1250 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి నెంబర్ 2 స్థానం లో కొనసాగుతుంది..ఇది ఇలా ఉండగా KGF సినిమా ప్రారంభం అయ్యే ముందు జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారాయి..ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాని తొలుత బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ని ఊహించుకొని రాసాడట ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్..కానీ కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన వాడు కావడం తో బాలీవుడ్ లో హృతిక్ రోషన్ చుట్టూ ఉండే PR వాళ్ళు కనీసం ఆయనని కలిసే ఛాన్స్ కూడా ఇవ్వలేదంట..దాంతో ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తియ్యాలనుకున్నాడు..ఆయనని కలిసి స్టోరీ చెప్పాడు కూడా..కానీ అప్పటికే రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో నటిస్తూ బిజీ గా ఉన్నాడు..తన తదుపరి సినిమా బోయపాటి శ్రీను తో చేస్తాను అని మాట కూడా ఇచ్చేసాడు..ఆ సినిమా తర్వాత రాజమౌళి #RRR కి కూడా రామ్ చరణ్ డేట్స్ లాక్ అయ్యిపోయాయి.. ఇలాంటి సమయం లో ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేను..కథ అద్భుతంగా ఉంది..వింటుంటేనే రోమాలు నిక్కపొడుస్తున్నాయి..భవిష్యత్తులో ఈ సినిమాని మనం చేద్దాం అంటూ రామ్ చరణ్ మాటిచ్చాడట ప్రశాంత్ నీల్..కానీ అంత సమయం ఎదురు చూడడం ఇష్టం లేక ప్రశాంత్ నీల్ యాష్ తో ఈ సినిమాని చేసి ప్రభంజనం సృష్టించాడు.
KGF సినిమాలో యాష్ ని చూస్తునప్పుడల్లా ఈ సినిమాని రామ్ చరణ్ చేసి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది అని మన అందరికి చాలా సార్లు అనిపించి ఉండొచ్చు..కానీ బాడ్ లక్..చరణ్ కి ఈ సినిమా మిస్ అయ్యింది..ఒక్కవేల ఈ సినిమా చరణ్ చేసి ఉంటె టాలీవుడ్ మార్కెట్ కన్నడ కంటే చాలా పెద్దది కాబట్టి ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చి ఉండేవని ట్రేడ్ పండితుల అభిప్రాయం..అయితే రామ్ చరణ్ KGF సినిమాని మిస్ చేసుకొని ఉండొచ్చు కానీ..ప్రశాంత్ నీల్ మల్టీ యూనివర్స్ నుండి తప్పించుకునే ఛాన్స్ లేదని తెలుస్తుంది..త్వరలోనే ఆయన రామ్ చరణ్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..DVV దానయ్య ఈ సినిమాని నిర్మించబోతున్నాడు..అయితే త్వరలోనే రాబొయ్యే KGF చాప్టర్ 3 కి మరియు సలార్ కి అలాగే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చెయ్యబోతున్న సినిమాకి..ఈ మూడింటికి లింక్ ఉంటుంది అని ప్రశాంత్ నీల్ తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు ఆ లింక్ ని రామ్ చరణ్ తో తియ్యబోతున్న సినిమాకి కూడా ఉండబోతోందనే టాక్ వినిపిస్తుంది..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి మరి.