
రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ తర్వాత దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిత్రం కేజీఎఫ్ ఛాప్టర్-2. కేజీఎఫ్ ఫస్ట్ పార్టు అనూహ్యంగా ఘనవిజయం సాధించడంతో కేజీఎఫ్ సెకండ్ పార్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నడ రాక్‌స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అంచనాలకు మించి రికార్డు వసూళ్లను కొల్లగొట్టింది. తెలుగు, కన్నడ, హిందీతో పాటు విడుదలైన అన్ని దక్షిణాది భాషల్లో ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. ప్రత్యేకించి హిందీలో చేరుకున్న ల్యాండ్ మార్క్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్లో ఆర్.ఆర్.ఆర్ మూవీ కంటే కేజీఎఫ్-2 మూవీకే ఎక్కువ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా మొదటి రోజు రూ. 53.95 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ హైయ్యెస్ట్ టాప్ గ్రాసర్‌గా రికార్డ్స్ క్రియేట్స్ చేసింది. ఇక 14 రోజుల్లో ఈ సినిమా హిందీలో 343.13 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో టాప్ 2లో సాగుతోంది.
ఒకప్పుడు దక్షిణాది సినిమాలను పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు ఉత్తరాది ప్రేక్షకులు. కానీ ఇప్పుడు అలా కాదు.. మన సినిమాలను అక్కడ వాళ్లు కూడా బాగా ఆదరిస్తున్నారు. మంచి టాలెంట్ డైరెక్టర్స్ తెరకెక్కించిన ప్యాన్ ఇండియా సౌత్ సినిమాలు హిందీలో ఈజీగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసే స్థాయికి ఎదిగింది. ఈ ఏడాది ఆర్.ఆర్.ఆర్ మూవీ రూ .250 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మరోవైపు కేజీఎఫ్-2 కూడా బాలీవుడ్లో రూ.350 కోట్లకు చేరువలో ఉండటం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టు 400 కోట్ల మార్కును చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ కేజీఎఫ్-2 భారీ వసూళ్లను రాబట్టింది. ఏపీ, తెలంగాణలో రెండు వారాలకు ఈ సినిమా 121.30 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు రూ.75 కోట్ల షేర్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా రూ.950 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. వసూళ్ల పరంగా ఇంకా ఈ సినిమా కొత్త రికార్డులను సెట్ చేసే పనిలోనే ఉంది.
కేజీఎఫ్ సిరీస్‌లో హీరో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటి రవీనాటాండన్, టాలీవుడ్ యాక్టర్లు ప్రకాశ్ రాజ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ నీల్ టేకింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యష్ యాక్టింగ్, సంజయ్‌దత్ విలనిజం .. ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. కేజీఎఫ్ పార్టు 3 కూడా ఉంటుందని యష్ చెప్పిన దగ్గర నుంచి అందరిలో మళ్లీ ఆసక్తి మొదలైంది. మరి పార్టు 3 సెట్స్ పైకి రావడానికి ఎంత సమయం పడుతుందో వేచి చూడాలి. కేజీఎఫ్ 2లో తాను కూడబెట్టిన బంగారమంతా తీసుకుని షిప్పులో సముద్రంలోకి వెళ్లిన రాకీ భాయ్ అక్కడ చనిపోయినట్టుగా చూపించారు. అంతకుముందే అతని భార్య కూడా అధీర కారణంగా ప్రాణాలు కోల్పోతుంది. దాంతో ఇప్పుడు కేజీఎఫ్ 3 ఎక్కడి నుంచి మొదలవుతుంది అనే ఆసక్తి అందరిలో మొదలైంది. మరోవైపు బాలీవుడ్లో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మూవీ కేజీఎఫ్ కంటే తక్కువే వసూలు చేసింది. ఆర్.ఆర్.ఆర్ మూవీ తొలివారం రూ. 133.07 కోట్లు నెట్ కలెక్షన్లు సాధించింది. రెండో వారం రూ. 76.25 కోట్లు నెట్ కలెక్షన్లు, మూడో వారం ఈ సినిమా రూ. 23.50 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. మొత్తంగా ఈ సినిమా రూ. 267.67 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో సౌత్ డబ్బింగ్ సినిమాల్లో మూడో స్థానంలో ఉంది.