
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ప్రస్తుతం KGF చాప్టర్ 2 మేనియా లో మునిగిపోయింది..టాలీవుడ్ , కోలీవుడ్ , బాలీవుడ్ మరియు శాండిల్ వుడ్ అని తేడా లేకుండా ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తుంటే ప్రతి ఒక్కరికి మతి పోతుంది..ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్ లో సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తూ ఉంటె భవిష్యత్తు లో అక్కడి స్టార్ హీరో లు అయిన ఖాన్స్ కి కూడా అసాధ్యమే అని అర్థం అవుతుంది..ఇక తెలుగు మరియు తమిళ బాషలలో కూడా ఈ సినిమా అక్కడ డబ్బింగ్ సినిమాలు అన్నిట్లో ఆల్ టైం రికార్డు వసూళ్లు సాధిస్తున్న సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది, ఇదే ట్రెండ్ కొనసాగితే అతి తర్వలోనే #RRR రికార్డ్స్ ని మాత్రమే కాదు 1800 కోట్ల రూపాయిలు వసూలు చేసిన బాహుబలి పార్ట్ 2 సినిమా రికార్డులు కూడా బద్దలు కొట్టడం ఖాయం అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..నాలుగు రోజులకు గాను ఈ సినిమా ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పెర్ఫరొమాన్సు గురించి మాట్లాడాల్సిందే..మొదటి రోజు నుండి నేటి వరుకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ట్రెండ్ ని చూస్తూ ఉంటె కచ్చితంగా ఫుల్ రన్ లో 500 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేస్తుంది అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..మొదటి రోజు అక్షరాలా 53 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసిన ఈ చిత్రం , రెండవ రోజు 46 కోట్ల రూపాయిలు , మూడవ రోజు 42 కోట్ల అలాగే నాల్గవ రోజు అక్షరాలా 52 కోట్ల రూపాయిలు వసూలు చేసి కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 190 కోట్ల కి పైగా నెట్ వసూళ్లను రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది..రాజమౌళి లేటెస్ట్ సెన్సేషన్ #RRR చిత్రం విడుదల రోజు నుండి ఇప్పటి వరుకు దాదాపుగా 250 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చెయ్యగా..KGF చాప్టర్ కేవలం నాలుగు రోజుల్లోనే 200 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసి అతి త్వరలోనే #RRR మూవీ బాలీవుడ్ వసూళ్లను దాటనుంది.
తెలుగు లో కూడా ఈ సినిమా వసూళ్లు ఏ మాత్రం ఊపు తగ్గకుండా డబ్బింగ్ చిత్రాలలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మూడు రోజులకు గాను దాదాపుగా 42 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసి డబ్బింగ్ సినిమాలలో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది..నాలుగు రోజులకు కలిపి ఈ సినిమా ఇక్కడ దాదాపుగా 53 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త ..ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ అక్షరాలా 75 కోట్ల రూపాయలకు జరగగా బ్రేక్ ఈవెన్ మార్కుని అతి తేలికగా అందుకొని ఫుల్ రన్ లో 90 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ పండితుల అంచనా..మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి 490 కోట్ల రూపాయిలు గ్రాస్ ని కేవలం నాలుగు రోజుల్లో వసూలు చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో కచ్చితంగా #RRR మూవీ రికార్డ్స్ ని బద్దలు కొట్టే దిశగా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది..మరి ఫుల్ రన్ లో ఈ సినిమా బాహుబలి పార్ట్ 2 సాధించిన 1800 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుందా లేదా అనేది చూడాలి.