
విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఇటీవలే విడుదల అయ్యి భారీ విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..2019 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదల అయిన F2 సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ పై విడుదలకి ముందు నుండే భారీ అంచనాలు ఉన్నాయి..ఆ అంచనాలను అందుకునే విధంగా ఈ సినిమా ని ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తీర్చి దిద్దడం తో ఓపెనింగ్స్ నుండి లాంగ్ రన్ వరుకు అద్భుతమైన వసూళ్లను దక్కించుకుంది ఈ చిత్రం..అందరి అంచనాలకు మించి ఈ సినిమా మొదటి రోజు దాదాపుగా 12 కోట్ల రూపాయిల షేర్ ని సొంతం చేసుకుంది..ఇది అటు వెంకటేష్ ఇటు వరుణ్ తేజ్ కెరీర్ లో భారీ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు..కానీ మంచి వసూళ్లే వచ్చినప్పటికీ కూడా వరుసగా కొత్త సినిమాలు రావడం..అవి కూడా సూపర్ హిట్ అవ్వడం F3 మూవీ కలెక్షన్స్ పై భారీ ప్రభావం చూపించింది..ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపుగా 65 కోట్ల రూపాయలకు జరగడం తో బయ్యర్స్ కి నష్టాలు తప్పలేదు..ఒక్కసారి ఈ చిత్రం ఫుల్ రన్ లో ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
నైజాం లో ఈ సినిమాని దిల్ రాజు సొంతంగా విడుదల చేసుకున్నాడు..కానీ ఈ సినిమాకి ఉన్న థియేట్రికల్ వేల్యూ దాదాపుగా 23 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగింది..కానీ ఫుల్ రన్ లో ఈ సినిమా ఇక్కడ 19 కోట్ల రూపాయిల షేర్ మాత్రమే వసూలు చేసింది..అంటే దాదాపుగా 4 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది అన్నమాట..సీడెడ్ , ఉత్తరాంధ్ర ప్రాంతాలలో కూడా ఈ సినిమా మొదటి వారం తర్వాత వసూళ్లు తగ్గుముఖం పట్టాయి..రాయలసీమ ప్రాంతం లో దాదాపుగా 6 కోట్ల రూపాయిల షేర్ ని ఫుల్ రన్ లో వసూలు చేసిన ఈ సినిమా..ఉత్తాంధ్ర ప్రాంతం లో కూడా 6 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది..నెల్లూరు , గుంటూరు మరియు కృష్ణ జిల్లాల్లో కూడా ఈ సినిమాకి నష్టాలు తప్పలేదు..మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమా కేవలం 42 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది..అద్భుతమైన మొదటి వారం తర్వాత ఈ సినిమా ఇలా పడిపోవడానికి కారణం విక్రమ్ సినిమా సృష్టించిన ప్రభంజనమే అని ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.
కలెక్షన్ల పరంగా విక్రమ్ సినిమా అన్ని ప్రాంతీయ బాషలలో ప్రభంజనం సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..తెలుగు లో కూడా అదే రేంజ్ వసూళ్లను సొంతం చేసుకుంటూ ముందుకి దూసుకుపోతుంది..ఆ చిత్రం ప్రభావం వల్లే F3 రన్ ఆగిపోయింది అని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న మాట..ఇక F3 సినిమా అమెరికా లో కూడా ఓపెనింగ్స్ అదరగొట్టినప్పటికీ ఫుల్ రన్ లో మాత్రం ఇక్కడ కూడా చేతులు ఎత్తేసింది..F2 సినిమా ఇక్కడ దాదాపుగా 2 మిలియన్ డాలర్ల వరుకు వసూలు చేసింది..కానీ F3 సినీమామాత్రం కేవలం 1.2 మిలియన్ మాత్రమే వసూలు చేసింది..ఇక్కడ కూడా ఈ సినిమా లాభాలను ఆర్జించలేదు..అలా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమా కేవలం 53 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చెయ్యగా.ఫుల్ రన్ లో దాదాపుగా 12 కోట్ల రూపాయిల నష్టాలను చవిచూసి యావరేజి హిట్ గా నిలిచింది..ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 65 కోట్ల రూపాయలకు జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే..F2 సినిమాకి సీక్వెల్ అవ్వడం వల్లే బయ్యర్లు ఈ రేంజ్ లో ఎగబడి ఈ సినిమాని ఈ స్థాయి రేట్లతో కొనుగోలు చేసారు..అందుకే నష్టాలు వచ్చాయి.