
కరోనా మహమ్మారి విలయ తాండవం వల్ల కుదేలు అయ్యిపోయిన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కాసుల కనకవర్షం లో తడిసి ముద్ద అయ్యిపోతుంటుంది..అఖండ సినిమా తో గ్రాండ్ గా ప్రారంభం అయినా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ జైత్ర యాత్ర, ఆ తర్వాత పుష్ప, డీజే టిల్లు,భీమ్లా నాయక్, RRR , KGF చాప్టర్ 2 , సర్కారు వారి పాట సినిమాలతో వరుస విజయాలు అందుకొని, లాక్ డౌన్ కారణం గా ఇన్నేళ్లు భరించిన నష్టాలు అన్ని పూడ్చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..మధ్యలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా మరియు ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలు మాత్రం దారుణ పరాజయాలు పొంది బయ్యర్స్ కి కన్నీళ్లు మిగిలించాయి..ఇవి పక్కన పెడితే ఎక్కువ శాతం విజయం సాధించిన సినిమాలే ఉండడం నిజంగా శుభ పరిణామం అనే చెప్పాలి..ఇక రెండు రోజుల క్రితం విడుదల అయినా విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ F 3 చిత్రం కూడా విడుదల అయినా మొదటి రోజు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా 12 కోట్ల రూపాయలకు పైగానే షేర్ ని సాధించింది..ఇది అటు వెంకటేష్ కెరీర్ లోను మరియు వరుణ్ తేజ్ కెరీర్ లోను భారీ ఓపెనింగ్ గా చెప్పుకోవచ్చు..ఇక రెండవ రోజు అయితే సాధారణ టికెట్ రేట్స్ ఉన్నా కూడా ఈ సినిమా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండి 9 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది..ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా కుమ్మేస్తుంది అనే చెప్పాలి..మొత్తం మీద రెండు రోజులకు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 22 కోట్ల రూపాయలకు పైగానే షేర్ ని సాధించింది..ఒక్క సీనియర్ హీరో సినిమాకి ఈ రేంజ్ వసూళ్లు అంటే అరాచకం అనే చెప్పాలి..ఇక మూడవ రోజు అయితే ఈ సినిమా నూన్ షోస్ నుండే విపరీతమైన బాటింగ్ మొదలు పెట్టేసింది..ఇక ఫస్ట్ షోస్ మరియు సెకండ్ షోస్ అయితే న భూతొ న భవిష్యతి రేంజ్ లో ఉన్నాయి..ఈ ట్రెండ్ ని చూస్తూ ఉంటె మూడవ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 10 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని ట్రేడ్ లో వినిపిస్తున్న వార్త.
మొత్తం మీద మూడు రోజులకు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా దాదాపుగా 60 కోట్ల రూపాయలకు జరిగింది..తోలి మూడు రోజుల్లోనే సగానికి పైగా రికవరీ సాధించడం తో మొదటి వారం లోనే బయ్యర్లకు లాభాలు తెచ్చి పెట్టె అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇదే ఊపుని కొనసాగిస్తే ఈ సినిమా ఫుల్ రన్ లో 75 నుండి 80 కోట్ల రూపాయిల షేర్ ని సాధించిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..విక్టరీ వెంకటేష్ మరోసారి తన వింటేజ్ కామెడీ టైమింగ్ ని బయటపెట్టడం వల్ల ఈ సినిమాకి ఫామిలీ ఆడియన్స్ క్యూ కడుతున్నారు అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఓపెనింగ్ వీకెండ్ దంచేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి.