తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. కేఏ పాల్‌కు ఇటీవల ఊహించని పరిణామం ఎదురైంది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కేఏ పాల్ సిరిసిల్ల వెళ్తుండగా సిద్దిపేట జిల్లా జక్కాపూర్ వద్ద ఆయన్ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కేఏ పాల్ వాహనం దిగి కేఏ పాల్ మాట్లాడుతుండగా వాళ్లలో ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. డీఎస్పీ చూస్తుండగానే కేఏ పాల్‌పై దాడి జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో పోలీసులపై కేఏ …