Home Entertainment 92 కోట్లు పెట్టి కొన్నారు..మొదటి రోజు వచ్చిన లాభాలు ఎంతో తెలిస్తే మెంటలెక్కిపోతారు

92 కోట్లు పెట్టి కొన్నారు..మొదటి రోజు వచ్చిన లాభాలు ఎంతో తెలిస్తే మెంటలెక్కిపోతారు

0 second read
0
0
2,844

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఏడాది విడుదలైన ఆచార్య సినిమా తో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, గాడ్ ఫాదర్ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాడు..ఆచార్య సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడం తో చాలా మంది చిరంజీవి వయసు అయిపోయింది ఇక ఆయన సినిమాలు ఎవ్వరు చూడరు అని కామెంట్ చేసేవారు..కానీ ఒక్కే ఒక్క హిట్ తో మెగాస్టార్ తన దురాభిమానులందరికి చావు దెబ్బ కొట్టాడనే చెప్పాలి..ఆచార్య పెద్ద ఫ్లాప్ అవ్వడం తో తన మార్కెట్ రేంజ్ ని బాగా తగ్గించుకొని చిరంజీవి ఈ సినిమాని తక్కువ రేట్స్ కి అమ్మమని నిర్మాతకి ఆదేశాలు జారీ చేసాడు..నిర్మాత కూడా మెగాస్టార్ మాటకి నో చెప్పకుండా తక్కువ రేట్స్ కి బిజినెస్ చేసాడు..అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమాకి దాదాపుగా 92 కోట్ల రూపాయలకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసారు.

ఇక గాడ్ ఫాదర్ విడుదల రోజే అక్కినేని నాగార్జున ‘ది ఘోస్ట్’ మరియు బెల్లంకొండ గణేష్ హీరో గా పరిచయమైనా ‘స్వాతి ముత్యం’ సినిమాలు విడుదలయ్యాయి..సోలో రిలీజ్ కాదు..పైగా టికెట్ రేట్స్ కూడా లేవు..దీనితో ఆచార్య సినిమాకి భారీ స్థాయి లో హౌస్ ఫుల్స్ దక్కినప్పటికీ కూడా మెగాస్టార్ రేంజ్ వసూళ్లు అయితే రాబట్టలేకపోయింది..ఒకసారి ప్రాంతాల వారీగా ఈ సినిమా వసూళ్లు ఎలా ఉండబోతున్నాయి అనేది చూస్తే..ఈ చిత్రం ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఒక కోటి 45 లక్షల రూపాయిలు వసూలు చేసినట్టు తెలుస్తుంది..నైజాం ప్రాంతం మార్నింగ్ షోస్ నుండి ఇరగ కుమ్మిన ఈ సినిమా ఇక్కడ మొదటి రోజు సుమారు 6 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిందని ట్రేడ్ పండితుల నుండి అందుతున్న సమాచారం..అలాగే రాయలసీమ ప్రాంతం లో 3 కోట్ల 45 లక్షలు, కృష్ణ జిల్లాలో కోటి 25 లక్షలు, నెల్లూరు జిల్లాలో 95 లక్షల రూపాయిలు..గుంటూరు జిల్లాలో 2 కోట్ల 45 రూపాయిలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 2 కోట్లు అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు కోట్ల 25 లక్షల రూపాయిలు వసూలు చేసినట్టు సమాచారం.

మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా 17 నుండి 18 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు..ఇది చిరంజీవి గారి రేంజ్ కి చాలా తక్కువ నెంబర్, కానీ ఒకే రోజు మూడు సినిమాలు విడుదల ఉండడం వల్ల దాని ప్రభావం గాడ్ ఫాదర్ మీద కాస్త పడిందని తెలుస్తుంది..ఇక ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో మాత్రం గాడ్ ఫాదర్ సినిమాకి అతి నీచమైన రిలీజ్ ఇచ్చినట్టు అభిమానులు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ని టాగ్ చేసి తిడుతున్నారు..అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ మెజారిటీ లొకేషన్స్ లో చాలా ఆలస్యం గా ఓపెన్ చెయ్యడం వల్ల ఈ సినిమా ప్రీమియర్ షో కలెక్షన్స్ ఎఫెక్ట్ అయ్యాయి ..అంతే కాకుండా చెన్నై లో అసలు గాడ్ ఫాదర్ సినిమాని విడుదల చేయలేకపోయారు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్..ఆస్ట్రేలియా లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది..అక్కడ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అవ్వకపోవడం వల్ల విడుదల ఆగిపోయింది..ఈ వీకెండ్ లో ఎదో ఒకరోజు నుండి ఆస్ట్రేలియా మరియు చెన్నై ప్రాంతాలలో షోస్ పడతాయని..కాబట్టి అభిమానులు కంగారు పడొద్దు అంటూ మేకర్స్ ధైర్యం చెప్తున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…