Home Entertainment 90 కోట్లు పెట్టి కొన్నారు.. డిజాస్టర్ టాక్ మీద మొదటి రోజే ఎంత లాభాలు వచ్చిందో తెలుసా?

90 కోట్లు పెట్టి కొన్నారు.. డిజాస్టర్ టాక్ మీద మొదటి రోజే ఎంత లాభాలు వచ్చిందో తెలుసా?

0 second read
0
0
803

ఒకవైపు సంచలన యువ హీరో.. మరోవైపు సంచలన దర్శకుడు.. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందో వివరించాల్సిన పనిలేదు. బద్రి, ఇడియట్, అమ్మనాన్న తమిళ అమ్మాయి, చిరుత, పోకిరి, బిజినెస్ మేన్, బుజ్జిగాడు, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన పూరీ జగన్నాథ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అందులోనూ అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ట్యాక్సీ వాలా వంటి సినిమాలతో యూత్‌లో క్రేజ్ ఏర్పరుచుకున్న విజయ్ దేవరకొండ హీరో అనగానే పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాను ప్లాన్ చేశారు. అంతేకాకుండా పాన్ ఇండియా లెవల్లో బిజినెస్ కూడా బాగానే జరిగింది. హిందీలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ మూవీలో భాగస్వామ్యం తీసుకోవడంతో బీ టౌన్‌లో కూడా మంచి హైప్ ఏర్పడింది. దీంతో ఓవరాల్‌గా రూ.90 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్‌ను లైగర్ చిత్రం పూర్తి చేసుకుంది.

భారీ అంచనాలతో రిలీజ్ కావడం, కావాల్సినన్ని థియేటర్లు అందుబాటులో ఉండటంతో లైగర్ మూవీకి హిట్ టాక్ వస్తే రూ.90 కోట్ల వసూళ్లు లెక్కలోకి రావని ట్రేడ్ విశ్లేషకులు భావించారు. కానీ తొలిరోజే డిజాస్టర్ టాక్ రావడంతో తొలిరోజు వసూళ్లు రికార్డు స్థాయిలోవచ్చినా రెండో రోజు నుంచే ఈ సినిమా బండారం బయటపడనుంది. ప్రస్తుతానికైతే సినిమాపై ఉన్న క్రేజ్ కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. నైజాంలో ఈ సినిమా హక్కులను వరంగల్ శ్రీను రూ.25 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అటు సీడెడ్‌లో రూ.9కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.7.5 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.3.8 కోట్లు, గుంటూరులో రూ.5.2 కోట్లు, కృష్ణాలో రూ.4.3 కోట్లు, నెల్లూరులో రూ.2.2 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 63 కోట్ల రూపాయల వసూళ్లు రావాలి. అయితే ప్రస్తుతం ఉన్న టాక్ కారణంగా ఫుల్ రన్‌లో ఈ మూవీ రూ.50 కోట్ల వరకు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

విజయ్ దేవరకొండ లైగర్ మూవీ రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టినా అది 50 శాతం కలెక్షన్‌లు మాత్రమే. అంటే రూ.40 కోట్ల మేర బయ్యర్లు నష్టపోవాల్సి ఉంటుందని ఇప్పటి నుంచే ట్రేడ్ అనలిస్టులు లెక్కలు వేస్తున్నారు. పోటీ సినిమాలు ఏమీ లేకపోయినా లైగర్‌కు ఈ స్థాయిలో నష్టం వస్తే అది డిజాస్టర్ కిందే మిగులుతుందని ఫిలింనగర్‌లో ప్రచారం నడుస్తోంది. గతంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఏక్ నిరంజన్, పైసా వసూల్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేదు. కానీ వాటికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దానికి కారణం అందులో హీరో క్యారెక్టరైజేష‌న్‌.. దాన్ని పూరీ జగన్నాథ్ డిజైన్ చేసిన తీరు. సినిమాలు ఫ్లాప్ అయినా కూడా అందులోని డైలాగులు అదిరిపోయేవి. కానీ మొట్ట మొదటిసారి కెరీర్‌లో అటు డైలాగులు లేక.. ఇటు క్యారెక్టరైజేష‌న్ సరిగ్గా లేక లైగర్ ఎటు కాకుండా పోయింది. సాధారణంగా పూరీ జగన్నాథ్ రాసుకునే డైలాగులను థియేటర్లలో హీరోలు పలుకుతుంటే అభిమానుల నుంచి ఈలలు, గోలలు కామన్‌గా కనిపిస్తుంటాయి. అయితే లైగర్‌లో ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా పూరీ మార్క్‌లో లేదని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో పదేళ్ల కింద రాసుకున్న కథ అంటూ పూరీ ముందే చెప్పాడని.. అయితే దానికి ట్రీట్‌మెంట్‌ కూడా అలాగే ఇవ్వడంతో ఏ మాత్రం కొత్తదనం లేకుండా తయారైందని పలువురు విమర్శిస్తున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సింగర్ వాణి జయరాం మృతి పై తలెత్తుతున్న అనుమానాలు..!

కన్నడతో పాటు పలు భాషల్లో 10,000కు పైగా పాటలు పాడిన నటి వాణీ జయరామ్ ఈరోజు (ఫిబ్రవరి 4) చెన్…