
ఈసారి బిగ్ బాస్ సీజన్ లో తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన కంటెస్టెంట్ ఎవరు అని అడిగితె మన అందరికి టక్కుమని గుర్తుకు వచ్చే పేరు గీతూ రాయల్..యూట్యూబ్ లో రివ్యూస్ ఇస్తూ గలాటా గీతూ గా మంచి పాపులారిటీ ని దక్కించుకున్న ఈమె జబర్దస్త్ లో ఎన్నో స్కిట్స్ చేసింది..అలా బుల్లితెర ప్రేక్షకులకు నామమాత్రం పరిచయమున్న గీతూ రాయల్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత మొదటి ఎపిసోడ్ నుండే తనదైన మార్కుతో గేమ్ ఆడుతూ బిగ్ బాస్ లో సరికొత్త ఒరవడిని సృష్టించింది..ఈమె ఆడిన గేమ్ కి లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు..అలాగే దురాభిమానులు కూడా ఉన్నారు..బిగ్ బాస్ ఇచ్చే ప్రతి టాస్కులోను గేమ్ చెంజర్ గా నిలిచిన గీతూ రాయల్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా పక్కాగా నిలుస్తుందని అనుకున్నారు..కానీ ఆమె టాప్ 10 కంటెస్టెంట్స్ లో ఒకరిగా కూడా నిలబడకకుండా వెనుతిరుగుతుందని మాత్రం ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులు కూడా ఊహించలేకపోయారు.
బాలాదిత్య విషయం ఆయన బలహీనతతో ఆడుకుంది అనే చిన్న రీజన్ వల్లే ఈరోజు గీతూ ఎలిమినేషన్ కి గురైందని విశ్లేషకుల అభిప్రాయం..కానీ చాలా మంది అభిప్రాయం అయితే గీతూ అంత తొందరగా బయటకి రావాల్సిన కంటెస్టెంట్ మాత్రం కాదనే..ఇప్పటికి ఆమె అభిమానులు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా గీతూ హౌస్ లోకి అడుగుపెడుతుందని హౌస్ లో కొంతమంది ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులు కూడా నమ్ముతున్నారు..ఈ వారం లో బిగ్ బాస్ ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఆమెని లోపాలకి పంపిస్తారేమో చూడాలి..గత వీకెండ్ లో డబుల్ ఎలిమినేషన్ పెట్టింది కూడా గీతూ రీ ఎంట్రీ కోసమేనని అందరూ అనుకుంటున్నారు..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ చూడాలి..ఇది ఇలా ఉండగా గీతూ రాయల్ ఈ హౌస్ లో ఇన్ని రోజులు ఉన్నందుకుగాను ఆమెకి మంచి పారితోషికమే ఇచుంటారని అందరూ అనుకోని ఉంటారు..కానీ ఆమెకి వచ్చిన పారితోషికం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టక తప్పదు.
9 వారాలకు గాను ఆమెకి కేవలం రెండున్నర లక్షల రూపాయిలు మాత్రమే ఇచ్చారట..ఇది బిగ్ బాస్ హిస్టరీ లోనే అతి తక్కువ పారితోషికం అని అంటున్నారు..బిగ్ బాస్ షో లో గీతూ పట్ల అన్ని అన్యాయమే జరిగిందని..సప్పగా వెళ్తున్న బిగ్ బాస్ షో ని పరుగులెత్తించిన గీతూ ఎలిమినేషన్ పెద్ద మోసం అనుకుంటూ ఉంటె పాపం ఆమెకి పారితోషికం విషయం లో కూడా తీరని అన్యాయం జరిగిందని చెప్పుకొస్తున్నారు ఆమె ఫాన్స్..అయితే బిగ్ బాస్ షో ద్వారా ఆమె పెద్దగా డబ్బులు సంపాదించి ఉండకపోవచ్చు మరియు టైటిల్ గెలవకపోవచ్చు కానీ..ఆమెని సినిమాల్లో ఆఫర్లు మాత్రం వెల్లువలా కురుస్తున్నాయట..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ సైతం ఆమె కోసం ప్రత్యేకంగా పాత్రలు రాయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది..ఇప్పటికే అల్లు అర్జున్ , పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకి అవకాశాలు వచ్చాయట..చిత్తూరు యాసలో మంచి కామెడీ టైమింగ్ ఉన్న గీతూ సినిమాల్లోకి వస్తే గొప్పగా రాణిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.