Home Entertainment 70 ఏళ్ళ క్రితమే పాన్ వరల్డ్ లెవెల్ లో ప్రభంజనం సృష్టించిన ఎన్టీఆర్ సినిమా ఏంటో తెలుసా?

70 ఏళ్ళ క్రితమే పాన్ వరల్డ్ లెవెల్ లో ప్రభంజనం సృష్టించిన ఎన్టీఆర్ సినిమా ఏంటో తెలుసా?

2 second read
0
0
9,479

టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా మరియు పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపుని సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి మన అందరికి తెలిసిందే..బాహుబలి సిరీస్ నుండి ప్రారంభమైన తెలుగు చలన చిత్ర పరిశ్రమ మేనియా లేటెస్ట్ గా #RRR వరుకు కొనసాగింది ఇంకా కొనసాగుతూనే ఉంది..ఇక గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..బాలీవుడ్ మొత్తం పుష్ప సినిమా మేనియా తో ఊగిపోయింది..రాజమౌళి కి మన టాలీవుడ్ నుండి బాలీవుడ్ లో ఎంత మంచి పేరు వచ్చిందో అల్లు అర్జున్ కి కూడా అదే స్థాయి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి..ఇక ప్రభాస్ కి పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ఎలానో ఉంది..ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ , రామ్ చర్మం , అల్లు అర్జున్ , ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో మార్కెట్ ని సంపాదించి మన తెలుగు సినిమా సత్తాని దేశాలు దాటించారు..త్వరలో పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు కూడా పాన్ ఇండియా లెవెల్ లో తమ సినిమాని విడుదల చెయ్యబోతున్నారు.

అయితే మనకి పాన్ ఇండియా మార్కెట్ లేటెస్ట్ వచ్చింది అని అందరూ అనుకుంటున్నారు..కానీ 70 ఏళ్ళ క్రితం బ్లాక్ అండ్ వైట్ సినిమాలు నడుస్తున్న కాలం లోనే మహానటుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పాన్ వరల్డ్ లెవెల్ లో తన సినిమాని విడుదల చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాడు అనే విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు..BN రెడ్డి గారి దర్శకత్వం లో ఎన్టీఆర్ మరియు భానుమతి హీరో హీరోయిన్లు గా 1951 వ సంవత్సరం లో మల్లేశ్వరి అనే సినిమాని పాన్ వరల్డ్ లెవెల్ లో అన్ని బాషలలో అనువదించి విడుదల చేసారు..అప్పట్లో ఈ సినిమా ఒక ప్రభంజనం..ఎన్టీఆర్ ని స్టార్ హీరో ని చేసింది ఈ సినిమానే..ఈ సినిమా చైనా దేశం లో పదికి పైగా థియేటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకుంది అంటే మాములు విషయం కాదు..పెద్దగా టెక్నాలజీ డెవలప్ అవ్వని రోజుల్లో మన తెలుగు సినిమా ఇతర దేశాలకు ఎగుమతి అయ్యి అఖండ విజయం సాధించడం అంటే మాటలు కాదు..ఆ ఘనత మన తెలుగు సినిమాకి మరియు ఎన్టీఆర్ కి మాత్రమే దక్కింది.

అప్పట్లో ఎన్టీఆర్ కంటే భానుమతి గారికి అనుభవం ఎక్కువ మరియు ప్రేక్షాదరణ కూడా ఎక్కువే..ఎన్టీఆర్ అప్పుడే ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్త హీరో..తొలుత భానుమతి గారు ఎన్టీఆర్ తో నటించడానికి ఇష్టపడలేదు..కానీ BN రెడ్డి గారు చొరవ తీసుకొని..ఎన్టీఆర్ కొత్త నటుడు..అద్భుతంగా నటిస్తాడు..పాన్ వరల్డ్ లెవెల్ లో అన్ని బాషలలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాను..నా కథ కి అతను మాత్రమే న్యాయం చెయ్యగలడు..దయచేసి ఒప్పుకొని అంటూ భానుమతి గారిని బ్రతిమిలాడి ఈ సినిమాలో ఆమెని నటింపచేసారు..ఇక ఆ తర్వాత అమోఘమైన ఫలితం వచ్చింది..ఎన్టీఆర్ స్టార్ హీరో గా ఎదిగిపోయాడు..భానుమతి గారి స్టార్ స్టేటస్ మరింత పెరిగిపోయింది..ఇలా 70 ఏళ్ళ క్రితమే మన తెలుగు సినిమా ఇతర దేశాల్లో ప్రభంజనం సృష్టించింది..లేటెస్ట్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలు చైనా మరియు జపాన్ వంటి భాషలకు అనువదించి ఇతర విడుదల చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఆలా విడుదల చేసిన సినిమాలలో దంగల్ , సీక్రెట్ సూపర్ స్టార్ , బాహుబలి , మగధీర వంటి సినిమాలు ఘానా విజయం సాధించాయి..చైనా దేశం లో అయితే దంగల్ మరియు సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలు ప్రబంజనం సృష్టించాయి..జపాన్ లో బాహుబలి మరియు మగధీర సినిమాలు అద్భుతంగా ఆడాయి..త్వరలోనే #RRR సినిమా కూడా చైనా మరియు జపాన్ బాషలలో విడుదల కాబోతుంది..ఈ సినిమా అక్కడ ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…