
విశ్వక్ సేన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని హీరోగా డైరెక్టర్ గా మరియు నిర్మాతగా మారి చేసిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ నిన్న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో ఘనంగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమా కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా అమెరికా నుండి అనకాపల్లి వరకు సెన్సేషనల్ ఓపెనింగ్ ని దక్కించుకుంది.ఒక స్టార్ హీరో సినిమా విడుదలైతే అన్నీ చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఎలా అయితే కళకళలాడుతుందో, ఈ చిత్రానికి కూడా అదే రేంజ్ ఓపెనింగ్ దక్కింది అట.సంక్రాంతి సినిమాలు వచ్చి వెళ్లిపోయిన తర్వాత సరైన కమర్షియల్ మూవీ లేక మొహం వాచిపోయినట్టు ఎదురు చూస్తున్న మూవీ లవర్స్ కి సరైన సమయం లో సరైన సినిమా పడడం తో థియేటర్స్ కి క్యూ కట్టేసారు.మొదటి రోజు అన్నీ ప్రాంతాలకు కలిపి ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
ఈ చిత్రానికి మొదటి ఆట నుండే పూర్ రేటింగ్స్ వచ్చాయి, కానీ టాక్ తో సంబంధం లేకుండా ఓవర్సీస్ ఆడియన్స్ కూడా ఈ చిత్రానికి అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చారు.అక్కడ కేవలం ప్రీమియర్స్ + మొదటి రోజు నుండే ఈ చిత్రానికి లక్షా 50 వేల డాలర్లు వచ్చాయి.ఒక మీడియం రేంజ్ హీరో కి ఈ స్థాయి వసూళ్లు నెగటివ్ టాక్ మీద రావడం అంటే సాధారణమైన విషయం కాదు.ఫుల్ రన్ లో కచ్చితంగా 1 మిలియన్ డాలర్స్ మార్కుని అందుకుంటుందని ట్రేడ్ పండితులు బలంగా నమ్ముతున్నారు.కేవలం ఓవర్సీస్ లోనే కాదు, తెలుగు స్టేట్స్ కూడా ఈ సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్ దక్కింది.అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజే రెండు తెలుగు రాష్ట్రాల నుండి నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.
ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 7 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది.మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి సుమారుగా 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.అంటే పెట్టిన డబ్బులకు 90 శాతం వసూళ్లు మొదటి రోజు నుండే రాబట్టింది అన్నమాట.అలా అతి చిన్న వయస్సులోనే హీరో గా , నిర్మాతగా మరియు డైరెక్టర్ గా గ్రాండ్ సక్సెస్ సాధించిన ఏకైక ఇండియన్ హీరో గా విశ్వక్ సేన్ చరిత్ర సృష్టించాడు.రాబొయ్యే రోజుల్లో ఈ టాలెంటెడ్ హీరో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి.