
సౌత్ ఇండియన్ టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా దశాబ్దాలు కొనసాగిన నటి మీనా..బాలనటిగా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన అభినయం కనబర్చి శబాష్ అనిపించుకున్న మీనా ఆ తర్వాత హీరోయిన్ గా కూడా పాన్ ఇండియన్ లెవెల్ లో స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటింది..తమిళం , తెలుగు , మలయాళం మరియు కన్నడ బాషలలో ఈమె జత కట్టని స్టార్ హీరో అంటూ ఎవ్వరూ మిగలలేదు అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..తెలుగు లో చిరంజీవి మరియు తమిళం లో రజినీకాంత్ మీనా కి ఎంతో ఆత్మీయులు..ఇక కెరీర్ పీక్ స్టేజి లో కొనసాగుతున్న సమయం లోనే మీనా విద్యాసాగర్ అనే బెంగళూరు కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుంది..పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మీనా సినిమాల్లో కొనసాగింది ఇప్పటికి కొనసాగుతూనే ఉంది..ఎంతో అన్యోయంగా జీవించిన ఈ దంపతులిద్దరికీ ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
మొదటి కూతురు నైనికా తమిళం లో పలు సినిమాలలో బాలనటిగా నటించింది..అందులో విజయ్ హీరో గా నటించిన తేరి సినిమాలో విజయ్ కూతురుగా నైనికా కనబర్చిన నటనని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు..అటు ఆర్థికంగా ఇటు మానసికంగా ఎంతో సంతోషకరమైన జీవితం గడుపుతున్న మీనా కుటుంబం లో కొద్దికాలం క్రితమే ఒక విషాద సంఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే..తానూ ఎంతగానో ప్రేమించిన భర్త విద్య సాగర్ ఊపిరి తిత్తుల సమస్య తీవ్ర రూపం దాల్చడం తో కన్నుమూశారు..తానే సర్వస్వము అనుకోని జీవిస్తున్న వ్యక్తి శాశ్వతంగా దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము..మీనా పరిస్థితి కూడా అంతే..అయితే సెలబ్రిటీ జీవితం ఎంత వరమో..అంత నరక ప్రాయం కూడా అని చెప్పక తప్పదు..మీనా భర్త చనిపోయిన రోజుల్లోనే మీనా గురించి సోషల్ మీడియా లో అనేక వార్తలు వచ్చాయి..అవి ఆమెని చాలా డిస్టర్బ్ చేసాయి..బాధలో ఉన్నప్పుడు ఇలాంటి రూమర్స్ ప్రచారం చెయ్యకండి అంటూ మీనా అప్పట్లో పుకారు రాయుళ్లను బ్రతిమిలాడుకుంది కూడా.
ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె రెండవ పెళ్లి చేసుకోబోతుంది అంటూ గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే..మీనా కుటుంబ సభ్యులు తమ ఇంటికి ఎంతో దగ్గర మనిషి అయినా ఒక వ్యక్తిని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి చూస్తున్నారని..అతని వయస్సు దాదాపుగా 60 ఏళ్ళు నిండి ఉంటుందని ఇలా పలు రకాల వార్తలు ప్రచారమయ్యాయి..అయితే ఈ వార్తలపై మీనా చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది..ఆమె మాట్లాడుతూ ‘ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో వార్తలు చాలా నీచంగా తయారు అయ్యాయి..మా ప్రమేయం లేకుండా ఏవేవో వార్తలు వస్తున్నాయి..అవి మమల్ని ఎంతగానో బాధిస్తుంది..నా జీవితం నా భర్త విద్యా సాగర్ కి మాత్రమే అంకితం..రెండవ పెళ్లి చేసుకుంటున్నాను అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు..అభిమానులు దయచేసి ఈ విషయం గుర్తించాలి’ అంటూ మీనా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపింది.