
ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులలో మన ఆంధ్ర ప్రదేశ్ కి స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు ఎవరు అంటే అది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అని నిస్సంకోచం గా చెప్పొచ్చు..ఇండియా లో ఏ రాజకీయ నాయకుడైన 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కి ఎదురైనా పరాజయం ఎదురైతే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటారు..కానీ పవన్ కళ్యాణ్ తాను నమ్ముకున్న సిద్ధాంతాలు..తనని నమ్ముకున్న అభిమానులు , కార్యకర్తలు..తనని నమ్మి ఓట్లు వేసిన పాతిక లక్షల మంది ఓటర్లకు జవాబుదారీతనం గా నిలబడ్డాడు..తన ప్రత్యర్థులు వ్యక్తిగతం గా ఆయనని ఎంత కృంగతీయ్యాలని చూసిన..రెండు చోట్ల ఓడిపోయాడు అని అవహేళన చేసిన ఏ మాత్రం చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో తాను నమ్ముకున్న దారిలో వెళ్తున్నాడు..ఒక పక్క పార్టీ ఆర్థికంగా బలపడడానికి సినిమాలు చేస్తూనే,మరోపక్క రాజకీయాలు చేస్తూ క్షేత్ర స్థాయి నుండి రాజకీయం గా జనసేన పార్టీ ని బలోపేతం చేసాడు..ఇది కదా రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం.
తనకి ఓటు వేసినా వేయకపోయినా ప్రజా క్షేత్రం లో ఆపద ఉన్న ప్రతిఒక్కరికి నేను ఉన్నాను అంటూ బాసటగా నిలిచాడు..ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఆయన చేపట్టిన ప్రతీ కార్యక్రమం జనాల్లోకి బాగా వెళ్ళింది..పవన్ కళ్యాణ్ కి మిగిలిన రెండు రాజకీయ పార్టీలకు లాగ సొంత మీడియా లేదు..ఆయన అభిమానులే ఆయన మీడియా..అభిమాన బలంతోనే ఆయన ధైర్యం గా ముందడుగు వేస్తున్నాడు..ఈ క్రమం లోనే ఆయన కౌలు రైతు భరోసా యాత్ర ని చేపట్టాడు..ఈ యాత్రలో ఆత్మహత్య చేసుకున్న 3000 మంది కౌలు రైతులకు లక్ష రూపాయిల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తానని మాట ఇచ్చాడు..ఇచ్చిన మాట ప్రకారమే ఇప్పటి వరుకు ఆయన 500 మంది రైతు కుటుంబాలకు సహాయం అందించాడు..ఇప్పుడు తాజాగా మరో 286 కుటుంబాలకు లక్ష రూపాయిల చొప్పున ఆర్ధిక సహాయం అందించబోతున్నాడు..ఈ నెల 18 వ తారీఖున పల్నాడు లో చనిపోయిన 286 కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయిలు ఆర్ధిక సహాయం చేయనున్నాడు.
అలా తన సొంత డబ్బులతో ఇప్పటి వరుకు 7 కోట్ల 86 లక్షల రూపాయిలు ఆర్ధిక సహాయం అందించాడు..ఇక్కడితో ఆగిపోలేదు..మరో 2000 కుటుంబాలకు పైగా ఆయన లక్ష రూపాయిల చొప్పున ఆర్ధిక సహాయం త్వరలోనే అందించబోతున్నాడు..అలా 30 కోట్ల రూపాయిల ఆర్ధిక సహాయం తన జోబులోనుండి తీసి ఇస్తున్న ఏకైక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ చరిత్రలో నిలిచిపోయాడు..ఇలాంటి వాడిని వచ్చే ఎన్నికలలో గెలిపించుకోలేకపోతే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు లాంటి మూర్ఖులు ప్రపంచం లో ఎక్కడా కూడా ఉండరు అని చెప్పొచ్చు..త్వరలోనే పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర చెయ్యబోతున్నాడు..అందుకోసం ప్రత్యేకంగా ‘వారాహి’ అనే పేరుతో బస్సుని కూడా సిద్ధం చేసుకున్నాడు..అతి త్వరలోనే ఈ యాత్ర ప్రారంభం కానుంది..ఈ యాత్ర తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ ముఖ చిత్రం మారిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..మరి నిజాయితీ తో కూడిన స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కి ముఖ్య మంత్రి పీఠం దక్కుతుందా లేదా అనేది చూడాలి.