
న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.విడుదల కి ముందు ఈ చిత్రం మీద ఏర్పడిన భారీ అంచనాలు అన్నిటినీ మ్యాచ్ చెయ్యడం లో నూటికి నూరు పాళ్ళు సక్సెస్ అయ్యింది ఈ సినిమా.నటీనటుల అద్భుతమైన నటనతో పాటుగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల టేకింగ్ ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లింది.అంచనాలకు తగ్గ్గట్టుగా టాక్ కూడా రావడం తో మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.అంతకు ముందు 30 కోట్ల రూపాయిల మార్కెట్ కూడా లేని నాని కి ఇప్పుడు ఏకంగా మొదటి రోజే 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు సాధించే రేంజ్ కి ఎదిగిదంటే మామూలు విషయం కాదు.
రెండవ రోజు కూడా ఈ చిత్రానికి అదిరిపొయ్యే రేంజ్ వసూళ్లు వచ్చాయి.ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం రెండవ రోజు ఈ సినిమాకి సుమారుగా 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.అలా రెండు రోజుల్లోనే ఈ సినిమా దాదాపుగా 30 కోట్ల రూపాయిల మార్కు కి దగ్గరగా వచ్చింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 50 కోట్ల రూపాయలకు జరిగింది.ఇంత మొత్తం బిజినెస్ నాని సినిమాకి జరగడం ఇదే తొలిసారి.బయ్యర్స్ రిస్క్ చేస్తున్నారేమో అని అందరూ అనుకున్నారు, కానీ వాళ్ళ నమ్మకాన్ని నిజం చేసాడు నాని.కేవలం రెండు రోజుల్లోనే 70 శాతం కి పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ని రికవరీ చేసేసాడు.ఇక మూడవ రోజు వసూళ్లు రెండవ రోజు వసూళ్ల కంటే ఎక్కువ ఉన్నాయి.ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం మూడవ రోజు ఈ చిత్రానికి పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి అని అంటున్నారు.
అలా మూడు రోజుల్లో సుమారుగా 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది ఈ సినిమా.బ్రేక్ ఈవెన్ మార్కుకి ఇక కేవలం పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే కావాలి.నాల్గవ రోజు ఆదివారం కావడం తో బ్రేక్ ఈవెన్ చాలా సులువుగా అయిపోతుందని అంటున్నారు విశ్లేషకులు.ఇదే ట్రెండ్ ని మరో రెండు వారాలు కొనసాగిస్తే అవలీల గా 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోలలో 70 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకున్న ఏకైక హీరో విజయ్ దేవరకొండ మాత్రమే.ఆయన హీరో గా నటించిన ‘గీతా గోవిందం’ సినిమా 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.ఆ చిత్రం తర్వాత మళ్ళీ 70 కోట్ల రూపాయిల మార్కుని అందుకున్న హీరో గా నాని నిలవబోతున్నాడు.