Home Entertainment 5 రోజుల్లో 250 కోట్లు..కానీ హిట్ అవ్వాలంటే ఇంకా ఎంత వసూలు చెయ్యాలో తెలుసా?

5 రోజుల్లో 250 కోట్లు..కానీ హిట్ అవ్వాలంటే ఇంకా ఎంత వసూలు చెయ్యాలో తెలుసా?

0 second read
0
0
289

రణ్‌బీర్‌కపూర్, ఆలియాభట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్ట్-శివ మూవీ టాలీవుడ్‌లో ఇప్పటికే ప్రాఫిట్ వెంచర్‌గా నిలిచి క్లీన్ హిట్ స్టేటస్ సాధించింది. అయితే బాలీవుడ్‌లో ఇంకా బ్రేక్ ఈవెన్‌కు చేరుకోలేదు. వీకెండ్‌లో మంచి వసూళ్లు రాబట్టినా ఈ మూవీ హిట్ స్టేటస్ అందుకోలేదు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సృష్టిలో బ్రహ్మాస్త్రం ఉంటే ఏమవుతుంది అన్న అంశంతో ఈ మూవీ తెరకెక్కింది. బ్రహ్మాస్త్రం కోసం విలన్‌లు ఏం చేశారు.. హీరో, హీరోయిన్‌ల ప్రేమ ముందు బ్రహ్మాస్త్రం ఏమైందన్న కథతో అందరిలోనూ ఈ మూవీ ఆసక్తి రేపింది. తెలుగులో రాజమౌళి వంటి ప్రఖ్యాత దర్శకుడు బ్రహ్మాస్త్ర మూవీని ప్రజెంట్ చేయడంతో అంచనాలు పెరిగాయి. దీంతో టాలీవుడ్‌లోనూ మంచి బిజినెస్‌ను రాబట్టుకుంది. తొలిరోజు టాక్ తర్వాత రెండో రోజు వసూళ్లలో డ్రాప్స్ కనిపించినా తొలి మూడు రోజుల్లోనే టాలీవుడ్‌లో బ్రేక్ ఈవెన్ సాధించింది.

బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్టు తొలి 5 రోజుల్లో మొత్తంగా రూ.250 కోట్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీ సూపర్ హిట్ స్టేటస్ అందుకోవాలంటే రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఈ మూవీ రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కింది. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ ఈ మూవీ భారీ స్థాయిలో నిర్మించారు. వీక్ డేస్‌లో కూడా సంతృప్తికర స్థాయిలో ఈ మూవీ వసూళ్లు రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే ఫ్లో కంటిన్యూ అయితే రెండో వీకెండ్ కల్లా బాలీవుడ్‌లోనూ ఈ మూవీ సేఫ్ వెంచర్ అవుతుంది. తొలిరోజు పబ్లిక్ టాక్ యావరేజ్ అని కాకుండా హిట్ అని వస్తే ఈ మూవీ ఫుల్ రన్‌లో రూ.వెయ్యి కోట్లకు పైగా సాధించేది అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్రహ్మాస్త్ర సినిమా బాలీవుడ్ చిత్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. గతంలో ధూమ్ 3 పేరిట ఈ రికార్డు ఉండేది. అమీర్ ఖాన్ త్రీ ఇడియట్స్, దంగల్ సినిమాలు కూడా తెలుగులో మంచి వసూళ్లను సాధించాయి.

అయితే ఇటీవల అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా గతంలోని రికార్డులను చెరిపివేస్తుందని భావించగా అంచనాలు తలకిందులయ్యాయి. కానీ బ్రహ్మాస్త్ర మూవీ అనూహ్యంగా వసూళ్లు రాబట్టుకుంది. దానికి కారణం ఇందులోని కథ అని అర్ధమవుతోంది. గ్రాఫిక్స్ ఎక్స్‌లెంట్‌గా ఉండటంతో కంటెంట్ కొంచెం అటూ ఇటూగా ఉన్నప్పటికీ ఒకసారి ఈజీగా సినిమాను చూడొచ్చు అని ఆడియన్స్ థియేటర్లకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తొలిరోజు రూ.3.68 కోట్లు రాబట్టిన ఈ మూవీ రెండో రోజు రూ.2.62 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు రూ.2.19 కోట్లు రాబట్టింది. నాలుగో రోజు రూ.కోటి రూపాయలు, ఐదో రోజు రూ.80 లక్షల రేంజ్‌లో వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అక్కినేని నాగార్జున, షారుఖ్ ఖాన్ క్యామియో రోల్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఫస్ట్ పార్టుకు వచ్చిన స్పందన చూసిన తర్వాత బ్రహ్మాస్త్ర సెకండ్ పార్ట్ దేవ్ మీద కూడా మంచి అంచనాలు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…