
విలక్షణమైన నటన తో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు ని ఏర్పాటు చేసుకున్న సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..విడుదలకు ముందు నుండే ఆసక్తికరమైన ట్రైలర్ తో అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపిన ఈ చిత్రం విడుదల తర్వాత ఆ అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ ఉండడం తో ఓపెనింగ్స్ అదిరిపోయాయి..ఈ సినిమాకి సమంత మార్కెట్ కి మించి 40 కోట్ల రూపాయిల వరుకు ఖర్చు చేసారు..కథలో ఉన్న దమ్ము ని నమ్మే అంత ఖర్చు పెట్టమని..సమంత ఇండియా వైడ్ మంచి క్రేజ్ ఉండడం వల్ల ఈ సినిమాకి కచ్చితంగా మంచి వసూళ్లు వస్తాయని..మేము భయపడాల్సిన అవసరం ఏమి లేదని మేకర్స్ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు..వాళ్ళ నమ్మకమే చివరికి నిజం అయ్యింది.
మొదటిరోజు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి కేవలం తెలుగు వెర్షన్ నుండే 7 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..ఇక రెండవ రోజైతే చాలా ప్రాంతాలలో మొదటిరోజు కంటే 30 శాతం ఎక్కువ వసూళ్లను నమోదు చేసుకుంది ఈ చిత్రం..అలా కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా తెలుగు వెర్షన్ లో 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..ఇక మూడవ రోజు అనగా ఆదివారం ఈ సినిమా ఇతర బాషలలో కూడా దుమ్ము లేపేసింది..కేవలం మూడవ రోజు దాదాపుగా 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంచనా వేస్తున్నారు..అలా కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం 25 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి బ్రేక్ ఈవెన్ వైపు పరుగులు తీస్తుంది..ఈ మూడు రోజులకు కలిపి షేర్ 12 కోట్ల రూపాయిల వరుకు ఉంటుందని అంచనా..ఈ సినిమా తెలుగు లో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 11 కోట్లు వసూలు చెయ్యాలి.
ఆ 11 కోట్ల రూపాయిలు ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే దాటి లాభాల్లోకి రావడం పై బయ్యర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు..సినిమాలో కంటెంట్ బలంగా ఉండడం తో లాంగ్ రన్ కూడా బాగుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు..ఇక ఓవర్సీస్ లో అయితే సమంత విశ్వరూపం చూపించేస్తుంది..కేవలం మూడు రోజుల్లోనే 5 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ ని వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచేసింది..ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా 1 మిలియన్ మార్కుని అందుకుంటుంది అని అంచనా వేస్తున్నారు..సమంత గతం లో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘ఓ బేబీ’ కూడా ఇక్కడ 1 మిలియన్ మార్కుని అందుకుంది..ఈ సినిమా తో పాటు ఆమె హీరోయిన్ గా నటించిన దూకుడు ,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం,అత్తారింటికి దారేది,అఆ, సొన్ ఆఫ్ సత్యమూర్తి ఇలా ఒక్కటా రెండా ఈమె హీరోయిన్ గా నటించిన సినిమాలన్నీ కూడా అక్కడ 1 మిలియన్ మార్కుని అందుకున్నాయి..అలా అత్యధికంగా 1 మిలియన్ సినెమాలున్న ఏకైక హీరోయిన్ గా సమంత చరిత్ర సృష్టించింది.