
మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోనున్న సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడం లో సఫలం అయ్యింది అనే చెప్పాలి..మహేష్ బాబు ని ఆయన అభిమానులు ఎలా అయితే చూడాలి అని గట్టిగ కోరుకున్నారో ఆలా చూపించి అభిమానులు పదంగా చేసుకునేలా చేసాడు డైరెక్టర్ పరశురామ్ పెట్ల..సినిమా కంటెంట్ రొటీన్ అయ్యినప్పటికీ కూడా మహేష్ బాబు తన అద్భుతమైన ఎనర్జీ తో ఈ సినిమా ని మరోలెవెల్ కి తీసుకెళ్లడం లో సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి..ఆయన క్యారక్టర్ ని చూసే వాళ్లకి చాలా కొత్తగా కూడా అనిపించింది..ఇక డాన్స్ లో కూడా అద్భుతమైన ఎనర్జీ ని చూపిస్తూ థియేటర్ లో అభిమానులకు పూనకాలు రప్పించేలా చేసాడు..ఇవి అన్ని పక్కన పెడితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయలకు జరిగింది..నాలుగు రోజుల్లో ఎంత రికవరీ చేసింది..బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలి అంటే ఇంకా ఎంత వసూలు చెయ్యాలి అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
వరుసగా హాట్రిక్ హిట్స్ మీద కెరీర్ లో మహేష్ బాబు పీక్ ఫేస్ లో ఉండడం తో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా గట్టిగానే జరిగింది..ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమా హక్కులను దాదాపుగా 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు డిస్ట్రిబ్యూటర్లు..మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల రూపాయిల షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా దాదాపుగా 30 శాతం కి పైగా రికవరీ రేట్ ని సాధించింది..ఇక రెండవ రోజు 9 కోట్ల రూపాయిల షేర్..మూడవ రోజు 8 కోట్ల రూపాయిల షేర్, నాల్గవ రోజు కూడా 8 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి తోలి వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల రూపాయిల షేర్ ని సాధించేలా చేసి 70 శాతం రికవరీ రేట్ ని అందుకుంది..ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ గా నిలబడాలి అంటే మరో 45 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటె సోమవారం నుండి ఈ సినిమా పెద్దగా ఆడే అవకాశాలు అసలు కనిపించడం లేదు అనే చెప్పాలి..సోమవారం రెండు తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు..దీనితో డైలీ షేర్స్ ఒక్క కోటి రూపాయిల షేర్ కంటే తక్కువ వచ్చే ఉండే అవకాశాలు ఉన్నాయి అని టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..కానీ సోమవారం ఫస్ట్ షోస్ నుండి ఈ సినిమా మల్లి కచ్చితంగా పుంజుకుంటుంది అని..మహేష్ కి ఫామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు అని..లాంగ్ రన్ లో ఈ సినిమా సూపర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంటుంది అని మహేష్ బాబు అభిమానులు బలంగా నమ్ముతున్నారు..చూడాలి మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత వరుకు నెగ్గుకురాగలడు అనేది..ప్రస్తుతానికి అయితే ఓపెనింగ్స్ లో మాత్రం కుమ్మేసిందే అనే చెప్పాలి..మహేష్ బాబు సినిమా వచ్చింది అంటే థియేటర్స్ ఫామిలీ ఆడియన్స్ తో కళకళలాడిపోతుంది అనే దానికి మరోసారి నిదర్శనం లాగ నిలిచింది ఈ సినిమా.